ETV Bharat / briefs

స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగిరం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఈనెల 15న ఉన్నతాధికారులతో భేటీ కానుంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగిరం
author img

By

Published : Apr 9, 2019, 7:34 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగిరం

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఈసీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈనెల 11న రాష్ట్రంలో లోక్​సభ పోలింగ్​ ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్​ వెలువడనుంది. ఫలితాలను మాత్రం పార్లమెంట్​ ఎన్నికల ఫలితాల అనంతరం విడుదల చేస్తారు. కొన్ని జిల్లాల్లో మూడు, మిగతా చోట్ల రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.

లోక్​సభ ఎన్నికల ఫలితాల వెలువడేందుకు 40 రోజులు సమయం ఉండడం వల్ల ఆలోగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

రెండు, మూడు దశల్లో పోలింగ్​

సున్నిత ప్రాంతాలు ఎక్కువుగా ఉన్న భూపాలపల్లి, నల్గొండ, నిజామాబాద్​, సంగారెడ్డి వంటి జిల్లాల్లో మూడు విడతల్లో పోలింగ్​ అవసరమని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. పరిస్థితులకు అనుగుణంగా రెండు, మూడు విడతల్లో పోలింగ్​ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ముగియడానికి సుమారు నెల రోజులు సమయం పట్టనుంది.

అధ్యక్షుల ఎన్నిక

పరిషత్​ ఫలితాలు వెలువడిన వారం రోజుల అనంతరం జూన్​ నెలల్లో మండల, జిల్లా పరిషత్​ అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. ఖమ్మం తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాల అధ్యక్షుల పదవీ కాలం జూలై 4 న ముగుస్తుంది. ఖమ్మం జడ్పీ అధ్యక్ష పదవీ కాలం ఆగస్టు 6 వరకు ఉంది. ఆ గడువు ముగియగానే కొత్తవారు బాధ్యతలు స్వీకరిస్తారు.

15న ఉన్నతాధికారులతో భేటీ

ఎన్నికల నిర్వహణపై డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ నాగిరెడ్డి ఈనెల 15న భేటీ కానున్నారు. 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికల సన్నద్దతపై చర్చిస్తారు.

ఇవీ చూడండి: పోలీసులకు చిక్కిన రూ.8 కోట్లు కమలానివే...!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.