ETV Bharat / briefs

నీట్ ప్రవేశ ప్రక్రియకు రంగం సిద్ధం - students

అఖిల భారత వైద్య విద్య సీట్ల కోటాకు ప్రవేశ ప్రక్రియ సిద్ధమైంది. ఈనెల 19 నుంచి 24 వరకు ఆన్​లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 13 నుంచి 22 వరకు విద్యార్థులు కళాశాలలో చేరాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నీట్
author img

By

Published : Jun 14, 2019, 5:51 AM IST

Updated : Jun 14, 2019, 7:51 AM IST

నీట్ ప్రవేశ ప్రక్రియకు రంగం సిద్ధం

అఖిల భారత వైద్య విద్య కోటాలో ప్రభుత్వ కళాశాలలో చేరడానికి రెండు విడతల్లోనే ప్రవేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లకు మాప్ అప్ రౌండ్ ఉండదని అధికారులు తెలిపారు. ఇదే కోటాలో భర్తీ చేసే కేంద్ర వైద్య సంస్థలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ఈఎస్ఐ వైద్య కళాశాలలకు మాత్రం ఆఖరు విడతగా మాప్ అప్ రౌండ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తరహా వైద్య సంస్థలకు ఆగస్ట్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సీట్లు మిగిలితే.. వాటిని నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే సొంతంగా భర్తీ చేసుకోవడానికి వీలుగా ఆయా వైద్య సంస్థలకు అవకాశమిస్తారు.

నీట్ ర్యాంకుల ఆధారంగానే..

అఖిల భారత వైద్య విద్య కూటమి సీట్లలో ప్రవేశాలపై మెడికల్ కౌన్సిల్ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కశ్మీర్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత వైద్య విద్య కూటమిగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ నుంచి 225 ఎంబీబీఎస్ సీట్లను అఖిల భారత కోటాలోకి అందజేయడం ద్వారా రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో దాదాపు 8వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అవకాశముంది.

అఖిల భారత కోటా సహా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే కన్వీనర్ యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాలు కూడా నీట్ ర్యాంకుల ప్రాతిపాదికన భర్తీ చేస్తారు. అఖిల భారత కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు hptts://mcc.nic.in/ugcounselling వెబ్​సైట్​లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కళాశాలల సమాచారంతో పాటు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: 'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ

Last Updated : Jun 14, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.