ETV Bharat / briefs

'సామర్థ్యంలేని నాయకులు మనకొద్దు'

ఇంటర్​బోర్డు నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం ఎంతో మంది విద్యార్థులను బలితీసుకుందని అఖిలపక్ష నేతలు ఆవేదన చెందారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డిని భర్తరఫ్​ చేయాలని గవర్నర్​ను కోరారు.

'సామర్థ్యంలేని నాయకులు మనకొద్దు'
author img

By

Published : Apr 25, 2019, 11:14 PM IST

'సామర్థ్యంలేని నాయకులు మనకొద్దు'

ప్రభుత్వ వైఫల్యం వల్ల దాదాపు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అఖిలపక్ష నేతలు ఆవేదన చెందారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. బోర్డు అవకతవకల విషయంలో జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని అఖిల పక్ష నేతలు గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు.

అభద్రతాభావంలో విద్యార్థుల జీవితాలు

ఇంటర్​ బోర్డు చర్యల వల్ల విద్యార్థుల జీవితాలు అభద్రతా భావంలో ఉన్నాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ ఆవేదన చెందారు. విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వట్లేదన్నారు. ఈ నెల 29న ఇంటర్​ బోర్డు కార్యాలయం వద్ద అఖిల పక్ష నేతలంతా కలిసి ధర్నా చేపడతామని తెలిపారు.

న్యాయం జరిగేలా చూస్తాం

ఇంటర్​ పరీక్ష మూల్యాంకనాన్ని ఎటువంటి అర్హత, అనుభవం, సరైన సాఫ్ట్​వేర్​ లేని గ్లోబరీనా సంస్థకు అప్పగించి విద్యార్థుల భవిష్యత్​ నాశనం చేశారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. బాధితులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని భరోసా కల్పించారు.

విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్​ చేయాలి

గవర్నర్​ను కలిసిన అఖిల పక్ష నేతలు ఇంటర్​ బోర్డు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్​ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ మంత్రి తన విధులు సక్రమంగా నిర్వర్తించలేదని జగదీశ్​రెడ్డిని భర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: ఇంటర్​ బోర్డు నిర్వాకంపై కేసీఆర్,కేటీఆర్​లు స్పందించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.