ETV Bharat / briefs

'టైమ్' యూటర్న్​... మోదీకి జైకొడుతూ కథనం - టైమ్ మ్యాగజీన్

టైమ్ మ్యాగజీన్​ మోదీని కీర్తిస్తూ కథనాన్ని ప్రచురించింది. కొద్దిరోజుల క్రితమే 'డివైడర్​ ఇన్​ చీఫ్​'గా మోదీని అభివర్ణిస్తూ ఓ వ్యతిరేక కథనం ఆ మ్యాగజీన్​లో వచ్చింది. ఎన్డీఏ అఖండ విజయం అనంతరం వైఖరి మార్చుకుంది.

'టైమ్' యూటర్న్​... మోదీకి జైకొడుతూ కథనం
author img

By

Published : May 29, 2019, 9:05 PM IST

నరేంద్ర మోదీని కీర్తిస్తూ అమెరికాకు చెందిన టైమ్​ మ్యాగజీన్ కథనాన్ని ప్రచురించింది. ప్రధానిగా భారత్​ను మోదీ ఐక్యం చేశారంటూ ​రాసింది.
ఇదే టైమ్ మ్యాగజీన్​​ ఈ నెల మొదట్లో 'డివైడర్​ ఇన్​ చీఫ్' శీర్షికతో​ మోదీకి వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది.

తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడడం, ఎన్డీఏ ఘన విజయం సాధించడం వల్ల దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇండియా ఐఎన్​సీ గ్రూప్​ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మనోజ్​ లాడ్వా.. మోదీపై సానుకూల కథనాన్ని టైమ్​లో రాశారు. మోదీ భారత్​ను ఐక్యం చేసినంతగా దశాబ్దాల నుంచి ఏ ప్రధాని చేయలేదంటూ కీర్తించారు.

"మోదీ విధానాలపై గత ఐదేళ్లలోనూ, ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక విమర్శలు వచ్చాయి. కానీ భారత ఓటు బ్యాంకును మోదీ ఏకం చేసినంత.. గత ఐదు దశాబ్దాల చరిత్రలో ఏ ప్రధాని చేయలేదు."

-లాడ్వా కథనంలోని ఓ భాగం

మనోజ్ లాడ్వా.. 2014 ఎన్నికల్లో మోదీ ప్రచార బృందంలో సభ్యుడు. ప్రచార బృందానికి చెందిన పరిశోధన, సందేశాల విభాగానికి నేతృత్వం వహించారు.

"భారత పాలనా వ్యవస్థలో ఉన్న అవినీతి అనే అతిపెద్ద చిల్లులను తొలి ఐదేళ్ల కాలంలో మోదీ పూడ్చేశారు. రానున్న దశాబ్దాల్లో సరైన విధంగా ముందుకెళ్లేందుకు వీలుగా .. వ్యవస్థలను మార్చేందుకు మరింత కఠినంగా వ్యవహరించాలి. ఆచరణాత్మక రాజకీయవేత్తగా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా రెండో దఫా పాలనాకాలంలో వ్యవహరించాలి."

-లాడ్వా కథనంలోని ఓ భాగం

ప్రపంచ సంస్థలు గుర్తించాయి

మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ అభివృద్ధి పథకాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఈ కథనంలో రచయిత అభిప్రాయపడ్డారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఐరాస వంటి సంస్థలు మోదీ చేసిన అభివృద్ధిని గుర్తించాయన్నారు.

సామాజికంగా అశాంతి నెలకొన్న సమయంలో మోదీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయని కథనంలో లాడ్వా అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలుగా సమాజం విడిపోవడానికి గల సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించడం వల్ల ఓటర్లు మోదీవైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు.

ఆర్థిక అంశాలపై మరో కథనం

అలిస్సా అయ్యర్ రాసిన మరో కథనం.. వ్యాపార అనుకూల విధానాల వల్ల మోదీకి అమెరికా పారిశ్రామిక వర్గాల్లో పరపతి పెరిగిందని అభిప్రాయపడింది.

"మోదీ రెండో దఫా పాలనా కాలంలో ధైర్యమంతమైన ఆర్థిక విధానాలు ఉండవచ్చు. నూతన విధానాలను ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆర్థిక వృద్ధిని పెంచేందుకు మరిన్ని సరళీకృత విధానాలను ప్రవేశపెట్టవచ్చు."

-అలిస్సా అయ్యర్​ కథనంలోని భాగం

పాక్ మూలాలున్న 'డివైడర్ ఇన్ చీఫ్' రచయిత

మోదీకి వ్యతిరేకంగా 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' కథనాన్ని రాసిన ఆతీశ్ తాసీర్... పాకిస్థాన్​ మూలాలున్న వ్యక్తి. పాకిస్థాన్ రాజకీయ నేత, వ్యాపారవేత్త సల్మాన్ తాసీర్ కుమారుడాయన.

ఇదీ చూడండి: బూతు బొమ్మల కట్టడికి భారత్​కు అమెరికా సాయం

AP Video Delivery Log - 1100 GMT News
Wednesday, 29 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1053: Syria Bombing Must Credit Syria Civil Defence 4213128
At least 14 reported killed in Idlib's air strike
AP-APTN-1053: Egypt Libya Militant No Access Egypt 4213133
Libyan commander hands over militant to Egypt
AP-APTN-1046: Belgium Far Right-Right-Right AP Clients Only 4213131
Belgian far-right leader in audience with the King
AP-APTN-1040: Sudan Strike AP Clients Only 4213129
Sudanese protesters on second day of strike
AP-APTN-1030: US KS Tornadoes 3 Must Credit KMBC, No Access Kansas City, No Use US Broadcast Networks 4213124
Widespread tornado damage near Kansas City
AP-APTN-1029: Thailand Fearful Exiles AP Clients Only 4213126
In fear for lives, Thai musicians live in exile
AP-APTN-1019: Kosovo Serbia Tension AP Clients Only 4213123
Kosovo Serbians call for unity ahead of protest
AP-APTN-1014: Austria Lauda Mourners AP Clients Only 4213122
Mourners praise F1 driver at funeral in Vienna
AP-APTN-1009: Nigeria Inauguration 2 No access Nigeria 4213121
Buhari takes oath at inauguration ceremony
AP-APTN-0948: China MOFA Briefing AP Clients Only 4213118
DAILY MOFA BRIEFING
AP-APTN-0945: Nigeria Inauguration No Access Nigeria 4213115
Inauguration of President-elect Buhari in Abuja
AP-APTN-0917: US VA Church Van Crash Must Credit WWBT, No Access Richmond, No Use US Broadcast Networks 4213111
4 dead, 8 hurt in church van crash in Virginia
AP-APTN-0908: France D Day Shelters AP Clients Only 4213110
Normandy caves preserved as part of D-Day history
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.