జీవితం ఎలా ఉండాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అన్నారు. హైదరాబాద్లో ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం అంటూ వృత్తి జీవితంలో ఎదిగే క్రమంలో తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఆహారం అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ మహిళా విభాగం ఛైర్పర్సన్ సోనా ఛత్వాని పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అప్పుడు వేలల్లో... ఇప్పుడు వందల్లో