ETV Bharat / briefs

చెరిపేస్తే చెరిగేదా చరిత్ర- 'ఖుదీరామ్​ బోస్'​ భరతమాత ముద్దుబిడ్డ! - ఇండియన్​ ఇండిపెండెన్స్​ డే

నీతి లేని శాసనాలు.. వలస పాలకుల ఘాతుకాలు.. ప్రశ్నిస్తే నిర్బంధాలు.. దారుణ మారణాలు.. విభజించి పాలించే దుష్టరాజకీయాలకు వ్యతిరేకంగా పిడికిళ్లు బిగిశాయి. వందేమాతర నిరసన జ్వాలలు ఎగశాయి. దేశమాత స్వేచ్ఛకు, తెల్లవారిని తరిమికొట్టేందుకు యువతరం రణగర్జన చేసింది. భరతమాత విముక్తికి ఉరికొయ్యనే ముద్దాడిన అమరవీరుడు ఖుదీరామ్ బోస్‌. అటువంటి అమరవీరుడి త్యాగాలకు గుర్తింపు లేని దయనీయ స్థితి నెలకొంది. ఆయన స్మారక చిహ్నాలనూ గాలికొదిలేశారు.

75 years of independence
ఖుదీరామ్​ బోస్​
author img

By

Published : Aug 15, 2021, 3:00 PM IST

Updated : Aug 16, 2021, 6:49 AM IST

తెల్లవాడి వెన్నులో వణుకుపుట్టించిన భరతమాత ముద్దుబిడ్డ

స్వాతంత్ర్య సమరంలో ముఖ్యభూమిక పోషించింది బిహార్ రాష్ట్రం ముజఫర్​పుర్​లోని తిర్హుట్ ప్రాంతం. దేశానికి స్వేచ్ఛా వాయువుల కోసం.. ఖుదీరామ్ బోస్‌ ఉరితాడును చుంబించి అమరుడైన నేల అది. ముజఫర్​పుర్ బంగాల్​కు, బిహార్​కు వారధిగా నిలిచింది. బంగాల్ విప్లవవీరులకూ కార్యక్షేత్రమైంది.

స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో, ఎందరెందరో వీరులు పాల్గొన్నారు. కానీ స్వతంత్ర భారతావనిలో దేశం కోసం ప్రాణమిచ్చిన యువసింగం ఖుదీరామ్ బోస్‌. అలాంటి అమరవీరుణ్ణి దశాబ్దాల పాటు ఏలికలు విస్మరించారు. అయినా చెరిపేస్తే చెరిగేదా చరిత్ర? ఖుదీరామ్ బోస్ భరతమాత ముద్దుబిడ్డ కాడా? యవ్వన ప్రాయంలో.. జీవితం మీద తీయటి కలలు కనే వయసులో.. దేశంకోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు అతడు. స్వాతంత్ర్యోద్యమానికి దిశానిర్దేశం చేసిన ఉత్తుంగతరంగం. అగ్ని సంద్రం.

khudiram-bose
ఖుదీరామ్​ బోస్

ఆగ్రహ జ్వాలతో..

ఖుదీరామ్ బోస్‌ 1989 డిసెంబర్ 3వ తేదీన బంగాల్ ప్రెసిడెన్సీలోని మిడ్నపూరు జిల్లాలో ఓ పల్లెలో కన్ను తెరిచాడు. తను తొమ్మిదో తరగతి చదువుతుండగా.. బ్రిటిష్ వాళ్ల అరాచకాలు స్వయంగా చూశాడు. అతడిలో ఆగ్రహాన్ని రగిలించాయి. 1901లోనే అరవింద్ ఘోష్ లాంటి నేతల ప్రసంగాలకు ఆకర్షితుడై దేశం పరిస్థితిని అర్ధంచేసుకున్నాడు.

పదహారేళ్ల ప్రాయం. ఉడుకు రక్తం ఉరకలేసే ఉద్యమకారుడు. ఉప్పొంగుతున్న విప్లవభావాలు. బంగాల్​ విభజనతో ఖుదీరామ్ హృదయం రగిలింది. స్వాతంత్ర్య సంగ్రామంలో కొదమసింగంలా దుమికాడు. జుగాంతర్ పార్టీలో చేరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల మీద బాంబులు చేశాడు. అతని దూకుడు, సాహస గాథలు విన్న తెల్లవాడి వెన్నులో వణుకుపుట్టింది.

ఉద్యమాల్లో పాల్గొంటున్న వేళ.. తన పదిహేడో ఏట.. 1906 ఫిబ్రవరి 28న తొలిసారి అరెస్టయ్యాడు. ముజఫర్​పుర్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉంచారు. అయితే బ్రిటిషర్ల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇక్కడో ముఖ్యాంశం ప్రస్తావించాలి.

డగ్లాస్​ కింగ్​పై కసి..

స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటున్న వారంటే ముజఫర్​పుర్ సెషన్స్ జడ్జి డగ్లాస్ కింగ్స్ ఫోర్డ్​కు కంటగింపుగా ఉండేది. కింగ్స్ ఫోర్డ్‌ నోటిమాటే శిక్షా స్మృతిగా చలామణీ అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులని తెలిస్తే చాలు రాక్షసుడైపోయేవాడు. ఈ క్రమంలో ఖుదీరామ్ బోస్ లాంటి యువకులు అతడి మీద ప్రతీకారానికి కసిగా ఉన్నారు. ఇలాంటి యువకులని సమావేశపరిచి అరవింద ఘోష్ దిశానిర్దేశం చేశాడు. ఈ క్రమంలో సెషన్స్ జడ్జి డగ్లాస్ కింగ్ ఫోర్డ్‌ను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతను ఖుదీరామ్ బోస్, అతడి మిత్రుడు ప్రఫుల్ల ఛాకీ లకు అప్పగించారు.

ఆ సమయం రానే వచ్చింది. ఆరోజే 1908 ఏప్రిల్‌ 30 వతేదీ సాయంత్రం. సెషన్స్ జడ్జిని హతమార్చేందుకు యూరోపియన్ క్లబ్ దగ్గర ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల ఛాకీ మాటువేశారు.

క్లబ్ దగ్గర వాహనంపై ఖుదీరామ్ బాంబు విసిరాడు. ప్రఫుల్ల రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. బాంబు దాడిలో మిసెస్ కెన్నెడీ, ఆమె కుమార్తె మృతిచెందారు. కానీ ఆ కారులో వీళ్లు చంపాలనుకున్న సెషన్సు జడ్జి లేడు. పథకం విఫలమైంది.

ఖుదీరామ్, ప్రఫుల్ల ఛాకి బ్రిటిష్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు. కానీ వేర్వేరు చోట్ల దొరికారు. సమస్తిపూర్ జిల్లా పుసా రైల్వే స్టేషన్ దగ్గర ఖుదీరామ్ బోస్‌ను అరెస్టు చేశారు. మిత్రుడు ప్రఫుల్ల ఛాకీ పోలీసులకు దొరికేలోగా.. రివాల్వర్​తో కాల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

ఇవీ చూడండి: మోదీది మళ్లీ అదే స్టైల్​- ఈసారి కోల్హాపురీ తలపాగాతో...

ఐదు వారాల్లో.. అడ్డంగా గీసేసి అడ్డదిడ్డ దేశ విభజన!

చిరునవ్వుతో ఉరికొయ్యలకు..

1908 మే 21న చరిత్రాత్మక ముజఫర్​పుర్ కుట్రకేసు విచారణకు వచ్చింది. జడ్జి కాండాఫ్‌ (corndoff), భారతీయ న్యాయమూర్తులు నాథుని ప్రసాద్, జనక్‌ప్రసాద్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పంధొమ్మిదేళ్ల నవయువకుడు ఖుదీరామ్ బోస్ ను చూసిన జడ్జి 'నీకసలు ఉరి అంటే తెలుసా? ఉరిశిక్షగురించి విన్నావా?' అని అడిగాడు. ఖుదీరామ్ చిరునవ్వుతో జవాబిచ్చాడు. 'జడ్జిమెంట్‌ నాకు అర్ధమైంది. మీరు నాకు కొంత సమయమిస్తే బాంబులు తయారు చేసే నైపుణ్యాలు నేర్పిస్తాను" అని సమాధానమిచ్చాడు. ఖుదీరామ్ బోస్​కు ఉరిశిక్షవిధిస్తున్నట్లు సెషన్స్ జడ్జి ప్రకటించారు. ఖుదీరామ్ అదరలేదు. గుండె చెదరలేదు. చిరునవ్వుతో ఉరిశిక్షను స్వాగతించాడు. 1908 ఆగస్టు 11న అతడికి ఉరిశిక్ష అమలు చేశారు.

khudiram-bose
ఖుదీరామ్​ బోస్​ ఉరిని ప్రతిబింబిస్తూ చిత్రం

భరతమాత ముద్దుబిడ్డను మరిచిందా?

మరి దేశం కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ, ఖుదీరామ్​ను జాతి స్మరిస్తోందా? దశాబ్దాలుగా ఏలికలు పట్టించుకున్నారా? ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా స్మారక చిహ్నాలు క్రమంగా శిథిలమవుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఖుదీరామ్ త్యాగాల మీద సరైన అవగాహనలేదంటున్నారు.

ఖుదీరామ్ అరెస్టయిన పుసా రైల్వే స్టేషన్ పేరు మార్చారు. జైలులో అమరవీరులు ఖుదీరామ్ బోస్‌, ప్రఫుల్ల ఛాకీల విగ్రహాలను ఏర్పాటు చేశారు. జైలు అధికారులు, సిబ్బంది ఏటా ఖుదీరామ్ వర్ధంతిని నిర్వహిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఉరిశిక్ష అమలు చేసిన జైలుకు షహీద్ ఖుదీరామ్ బోస్ సెంట్రల్ జైలుగా పేరు పెట్టి నివాళులర్పించారు. కానీ యువ యోధుడు ప్రాణాలర్పించిన ప్రదేశాన్ని చూసేందుకు ఎవరినీ అనుమతించటం లేదు.

ఖుదీరామ్ పార్ధివదేహానికి అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని పరిరక్షించాల్సి ఉంది.

బంగాలీలకు స్ఫూర్తి..

చరిత్మాత్మకమైన ముజఫర్​పుర్ కుట్ర కేసే జడ్జిమెంటు కాపీ బిహార్​లో ఉండాలి. కానీ కోల్‌కతా మ్యూజియంలో భద్రపరిచారు. స్వాతంత్ర్యోద్యమంలో బిహారు ఘనమైన వారసత్వమంతా కోల్ కతా మ్యూజియంలో మగ్గిపోతోందని సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎస్. కె ఝా చెబుతున్నారు.

khudiram-bose
ఖుదీరామ్​ బోస్​ను ఉరితీసిన ప్రదేశం

చిన్నవయసులో ఖుదీరామ్ ప్రాణత్యాగం బంగాలీలను కదిలించింది. అక్కడ చేనేతలు ఖుదీరామ్ పేరుతో ప్రత్యేక ధోవతులు నేస్తున్నారు. ధోవతుల మీద ఆయన పేరును అలంకరించి ఖుదీరామ్​కు కళాత్మక నివాళి అర్పించారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ముజఫర్​పుర్ కీలక పాత్రపోషించింది. విద్యార్ధులు తరగతులు బహిష్కరించారు. నగరానికి చెందిన గరమ్ దళ్‌ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నది.

అదే అసలైన నివాళి..

ఖుదీరామ్ బోస్ చేసిన ప్రాణత్యాగం అమూల్యమైనది. అతడి దేశభక్తి ఆసేతు హిమాచలాన్ని కదిలించింది. ఆయన ప్రాణత్యాగ ప్రదేశాన్ని ప్రజల సందర్శనకోసం తెరిచి ఉంచితే సముచిత నివాళి అవుతుంది. ఆయన భౌతికంగా లేకున్నా ముజఫర్​పుర్ ప్రజలు గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్నారు.

ఇవీ చూడండి: విదురాశ్వత విషాద ఘటన.. స్వాతంత్య్రోద్యమానికి కొత్త దిశ

Independence Day: మహోజ్జ్వల వేళ విభజన హోమం!

Last Updated : Aug 16, 2021, 6:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.