ETV Bharat / state

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల - తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల షెడ్యూల్

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల

author img

By

Published : Jan 23, 2023, 6:12 PM IST

Updated : Jan 23, 2023, 6:47 PM IST

18:09 January 23

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల

Teachers Promotions and Transfers Schedule: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి.. 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు.

తెలంగాణ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇటీవల గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్​రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,266 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు.

ఇవీ చూడండి..

ఉపాధ్యాయులకు కేసీఆర్ సంక్రాంతి కానుక.. పదోన్నతులు, బదిలీలకు గ్రీన్​సిగ్నల్

ఆమెతోనే నా పెళ్లి.. 52ఏళ్ల రాహుల్ గాంధీ మనసులో మాట ఇదే..

Last Updated : Jan 23, 2023, 6:47 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.