మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశారు(Maoist leader rk passed away). ఆర్కే మృతి (Maoist leader rk) ఘటన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా పని చేసిన ఆర్కే కేంద్ర కమిటీలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాక రామకృష్ణ జనస్రవంతిలోకి రాలేదని సమాచారం. అనారోగ్యంతోనే ఆర్కే చనిపోయినట్లు భావిస్తుండగా.. పోలీసు అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
మావోయిస్టు ఉద్యమానికే జీవితాన్ని ధారాదత్తం చేసిన రామకృష్ణ అలియాస్ ఆర్కేది ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ. తండ్రి సశ్చిదానంద ఉపాధ్యాయునిగా పని చేయడంతో ఆర్కే ప్రాథమిక విద్యాభ్యాసమంతా రెంట చింతల మండలం తుమృకోటలోనే జరిగింది. డిగ్రీవరకు మాచర్లలో చదివారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే మృతి (Maoist leader rk dead) మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
2004లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా..
రాడికల్స్ విద్యార్థిగా పనిచేస్తూ.. ఆర్కే ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2004లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు. పల్నాడులో సారా వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు. దాచేపల్లి, మాచర్ల ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. గుంటూరు రైలుపేటలో తూనికలు, కొలతల శాఖ వాహనాన్ని తగులబెట్టారు. ఏటుకూరు కూడలిలో సిటీ బస్సు తగులబెట్టినట్లు ఆరోపణలున్నాయి. పిన్నెల్లి సుందరరామిరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. మవోయిస్టు వ్యవస్థాపకుడు చార్ మజుందార్‌తో గుంటూరు మెడికల్ కాలేజీలో మీటింగ్ పెట్టినట్లు సమచారం.
ఆర్కే వివాహ జీవితం..
రామకృష్ణ(RK) భార్య పద్మ (శిరీష). ఆమెను ఉద్యమ సమయంలో వివాహం చేసుకున్నారు. ఆర్కే భార్య ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఆమె సొంత గ్రామంలో నివాసముంటోంది. కుమారుడు పృధ్వీ రెండేళ్ల క్రితం పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
చర్చలకు నేతృత్వం..
2004 అక్టోబరు 15న ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు తొలిసారి అడవుల నుంచి ఆర్కే అడవుల నుంచి బయటకొచ్చారు. మావోయిస్టుల తరఫున చర్చలకు ఆర్కే నాయకత్వం వహించారు. ఆర్కే మావోయిస్టు పార్టీలో అనేక కీలక పదవుల నిర్వహించారు. ఏపీ-ఒడిశా సరిహద్దు ఇన్‌చార్జిగా పనిచేసిన ఆర్కే.. నాలుగు దశాబ్దాలకుపైగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆర్కేపై దాదాపు 200కిపైగా పోలీసు కేసులున్నాయి.
సమాచారం లేదు..
2016 డిసెంబరులో తుమృకోట పాఠశాలకు 50 ఏళ్ల స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన తండ్రి సశ్చిదానంద విగ్రహాన్ని తల్లి రాజ్యలక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్కే హాజరు కాలేదు. అయితే ఆర్కే మృతి(guntur sp comments on Maoist rk death)పై తమకు ఎలాంటి సమాచారం లేదని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ చెబుతున్నారు.