ETV Bharat / jagte-raho

మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య - Mahabubabad District Crime News

Kidnappers kill kidnapped boy in Mahabubabad
మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
author img

By

Published : Oct 22, 2020, 10:12 AM IST

Updated : Oct 22, 2020, 11:19 AM IST

10:10 October 22

మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

Kidnappers kill kidnapped boy in Mahabubabad
మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

   మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.‌ తీవ్ర కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని ఈ ఉదయం పోలీసులు గుర్తించారు. బాలుడి మృతదేహం లభ్యమైన ప్రాంతంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడంలేదు. 

   దీక్షిత్‌ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసిన ఇద్దరు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాసేపట్లో  జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 

  దీక్షిత్‌రెడ్డిని ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో అపహరించారు. ఇంటి వద్ద ఆడుకుంటున్న దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.45 లక్షలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామంటూ ఫోన్‌లో కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. రూ.45 లక్షల్లో కొంత డబ్బు ఇచ్చేందుకు బాలుడి తల్లిదండ్రుల అంగీకరించారు. కిడ్నాపర్ చెప్పిన సమయానికి బాలుడి తల్లిదండ్రులు డబ్బు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ చోట కిడ్నాపర్ల కోసం వేచిచూశారు. కిడ్నాపర్ నుంచి స్పందన రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. బాలుడి ఆచూకీ కోసం 100 మందితో కూడిన 10 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చివరకు దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతమైంది.

సంబంధిత కథనాలు...

  1. జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!
  2. తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
  3. 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ

Last Updated : Oct 22, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.