ప్రవేశ పరీక్షల షెడ్యూలను రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ఖరారు చేసింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీఈసెట్ జరపనున్నారు. సెప్టెంబర్ 28, 29న ఎంసెట్ అగ్రికల్చర్, సెప్టెంబర్ 30, అక్టోబర్1న ఐసెట్ నిర్వహణకు నిర్ణయించారు.
అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్ ప్రవేశపరీక్షలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ వైరస్ దృష్ట్యా భౌతిక దూరంతో పాటు శానిటైజర్, మాస్కు వాడకం తప్పనిసరి చేయనున్నారు. షిప్టులవారీగా పరీక్షా గదిలో నిర్దేశిత సంఖ్య మేరకే సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.