ETV Bharat / state

LIVE VIDEO: సూపర్​ లగ్జరీ బస్సులో చెలరేగిన మంటలు... చూస్తుండగానే దగ్ధం

RTC bus catches fire in station ghanpur
RTC bus catches fire in station ghanpur
author img

By

Published : Jul 23, 2021, 4:30 PM IST

Updated : Jul 23, 2021, 9:21 PM IST

16:28 July 23

FIRE ACCIDENT: సూపర్​ లగ్జరీ బస్సులో చెలరేగిన మంటలు... చూస్తుండగానే దగ్ధం

సూపర్​ లగ్జరీ బస్సులో చెలరేగిన మంటలు... చూస్తుండగానే దగ్ధం

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు 30 మందితో వెళ్తున్న సూపర్​ లగ్జరీ(ఏసీ) బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనక ప్రాంతంలో మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్​... వెంటనే ఆప్రమత్తమై బస్సును పక్కన ఆపేశాడు. హుటాహుటిన ప్రయాణికులందరినీ కిందికి దించేశాడు.

క్షణాల్లోనే మంటలు బస్సును ఆవహించాయి. దట్టమైన పొగలు కక్కుతూ... చూస్తూండగానే బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదాన్ని స్థానికులు గుర్తించేలోపే బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టైంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఇవీ చూడండి: 

Last Updated : Jul 23, 2021, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.