జగిత్యాలలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన(Jagtial Farmers Protest today) నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు పెద్దఎత్తున పోరుబాట(Farmers Protest in Jagtial today) పట్టారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అన్నదాతలు.. పాత బస్టాండ్ నుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. పాలనాధికారి కార్యాలయం ముందు(jagityal farmers protest at collector office) బైఠాయించారు. వివిధ రకాల పంటలను ప్రదర్శిస్తూ.. నిరసన వ్యక్తం చేశారు.
రైతుల ఆత్మహత్యాయత్నం..
కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. మిల్లర్ల మోసాలు అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నించారు. కలెక్టరేట్ ముందు నుంచి వెళ్లిపోవాలని రైతులను పోలీసులు కోరారు. ఈ క్రమంలోనే పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదంతో పాటు స్వల్వ తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన మల్లేశం అనే రైతు ఆత్మహత్యకు(farmer suicide attempt) యత్నించాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని అంటించుకునేందుకు ప్రయత్నించగా... తోటి రైతులు, పోలీసులు అడ్డుకున్నారు.
మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం..
రోజుల తరబడి కల్లాల్లోనే ధాన్యం(Paddy procurement Telangana 2021) ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైఒకరు నెపం నెట్టుకుంటున్నాయి కానీ.. తమ గోడు పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌కు చేరుకున్న డీఎస్పీ ప్రకాశ్.. రైతులతో మాట్లాడారు. మిల్లర్ల మోసాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి పిటిషన్లు ఇవ్వాలని రైతులను కోరారు. డీఎస్పీ హామీతో రైతులు ధర్నాను విరమించారు. కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా.. మధ్యాహ్నం 12 నుంచి దాదాపు 4 గంటల వరకు సాగింది.
Farmers Deaths Telangana 2021: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. వరి కుప్పలపైనే తమ తోటి రైతులు కుప్పకూలుతున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి అప్పుల పాలై.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం..