ఝార్ఖండ్లో నక్సలైట్లతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.
పశ్చిమ సింగ్భమ్ జిల్లా కరాయీకేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నక్సలైట్లు వారిపై కాల్పులు జరగగా... ఎదురుదాడి చేశారు. ఈ ఎన్కౌంటర్లో ఏఎస్పీ మీనా బాడీగార్డ్, మరో జవాను గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇద్దరు భద్రతా సిబ్బందిని బలిగొన్న నక్సలైట్ల పనిబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో విస్తృతంగా గాలిస్తున్నారు.