ETV Bharat / crime

Driver rapes woman: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్​ అత్యాచారం - Telangana news

Driver rapes woman on Hyderabad private Travels bus

author img

By

Published : Feb 26, 2022, 4:25 PM IST

Updated : Feb 27, 2022, 5:31 AM IST

16:03 February 26

కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్​ అత్యాచారం

Driver rapes woman: ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన తనపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. హైదరాబాద్​లోని కూకట్​పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సొంత గ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 23న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఎక్కినట్లు తెలిపింది. బస్సులో లగేజీ మాత్రమే తరలించి.. రైలు ఎక్కాల్సి ఉన్నా బస్సులో సీటు కేటాయిస్తామని డ్రైవర్ రాజేష్ ఇచ్చిన హామీతో బస్సు ఎక్కినట్లు పేర్కొంది.

3 వేలు తీసుకుని చివరి స్లీపర్ బెర్త్ ..

3 వేలు తీసుకుని చివరి స్లీపర్ బెర్త్ కేటాయించిన డ్రైవర్.....అర్థరాత్రి ఆమె వద్దకు వెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. బస్సు దిగే సమయంలో దొంగతనం నెపంతో 7 వేల రూపాయలు లాక్కున్నట్లు ఆరోపించింది. నిందితుడు రాజేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది.

పోలీసుల అదుపులో డ్రైవర్..

అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు జేఎన్టీయూ నుంచి రాజ్​భవన్ వెళ్తున్న గవర్నర్ కాన్వాయ్‌ను కూకట్​పల్లిలో అడ్డుకునేందుకు యత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి సీఐ నర్సింగరావు తెలిపారు. నిందితుడు రాజేష్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: పెళ్లి కాలేదని వెళితే.. తల్లీకూతుళ్లపై రెండేళ్లుగా బాబా అత్యాచారం!

Last Updated : Feb 27, 2022, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.