ETV Bharat / state

TS Cabinet Meeting at Secretariat : సచివాలయంలో ముగిసిన.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

kcr
kcr
author img

By

Published : May 18, 2023, 3:20 PM IST

Updated : May 18, 2023, 6:22 PM IST

14:37 May 18

TS Cabinet Meeting at Secretariat : కొత్త సచివాలయంలో తొలిసారి జరుగుతున్న.. మంత్రివర్గ సమావేశం

TS Cabinet Meeting at Secretariat : సీఎం కేసీఆర్​ అధ్యక్షతన నూతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశం జరిగింది. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత జరుగుతున్న.. తొలి భేటీగా ఈ సమావేశం నిలువనుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పోడు పట్టాలు, గృహలక్ష్మి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇతర అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఈ ఏడాది చివరన జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నాహక ప్రణాళికపై కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే గవర్నర్​ తిరస్కరించిన బిల్లులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దశాబ్ది ఉత్సవాలపై ప్రత్యేక చర్చ..: జూన్​ 2 నుంచి 21 రోజుల పాటు.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఉత్సవాలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అమలు గురించి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికీ చాటి చెప్పాలని మొదటి నుంచీ సీఎం కేసీఆర్​ పార్టీ శ్రేణులకు తెలుపుతూ వస్తున్నారు. అయితే మంత్రులకు కూడా ఆ దిశలో దిశానిర్దేశం చేయనున్నారు. ఉత్సవాల కార్యాచరణ.. ప్రణాళికను మంత్రులు, అధికారులతో చర్చించి ఖరారు చేయనున్నట్లు సమాచారం. సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక స్తూపం ప్రారంభ తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.

పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం..! ఈ మంత్రివర్గ సమావేశంలోనే పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే మెదక్​ జిల్లా కొల్చారంలో ప్రముఖ భాషా కవి మల్లినాథ సూరి పేరు మీద సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటుపై కేబినెట్​ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. బుధవారం జరిగిన బీఆర్​ఎస్​ పార్టీ మీటింగ్​లో కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు.. దీనిపై కార్యాచరణను సిద్ధం చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మంజీరా కార్పొరేషన్​ ద్వారా మరో రూ.3300 కోట్లు రుణాల ద్వారా సేకరించేందుకు.. కేబినెట్​ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని సమాచారం. టీఎస్​పీఎస్సీలో పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర.. నాగల్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో ఎత్తిపోతల పథకానికి కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : May 18, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.