ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లతోపాటు జిల్లా పంచాయతీ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కరోనా నియంత్రణ చర్యలు, ఉపాధి హామీ, వ్యవసాయం, హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలపై చర్చిస్తున్నారు. ఉపాధి హామీ నిధులతో ఎక్కువ శాఖల్లో పనులు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఉపాధి హామీ అమలుకు సంబంధించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. నియంత్రిత సాగు సంబంధిత అంశాలపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు.
- ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు