మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr inspects Mallanna sagar) పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్లిన సీఎం... విహంగ వీక్షణం (KCR Aerial view) ద్వారా మల్లన్నసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎక్కువగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్లో ఈ సీజన్ నుంచే నీటిని నింపుతున్నారు.
ఈ ఏడాది పది టీఎంసీలు నింపాలని... దశలవారీగా పూర్తిగా నీరు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మల్లన్నసాగర్ జలాశయంలో 10.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సామర్థ్యంతో జలాశయం, కట్టను పూర్తి స్థాయిలో పరిశీలించాక మళ్లీ నీటిని నింపుతారు. విహంగ వీక్షణం ద్వారా మల్లన్నసాగర్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నింటిని (KCR Aerial view) క్షుణ్నంగా పరిశీలించారు.
ఇది వరకే ఒకసారి...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ఒకసారి విహంగ వీక్షణం (KCR Aerial view) ద్వారా మల్లన్నసాగర్‌ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ ప్రాజెక్టును విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ ఏడాది జలాశయాన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విహంగ వీక్షణం ద్వారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
పల్లెలు, పట్టణాలకు మిషన్ భగీరథ పేరిట సాగుతున్న తాగునీటి సరఫరాకు సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం గరిష్ఠస్థాయిలో తన సేవలందించనుంది. ఈ క్రమంలో 50 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయం నుంచి ఐదు జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాలతో బాటు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందించేందుకు శాశ్వత ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోలు గ్రామం వద్ద ప్రాజెక్టు లోపల ఇన్‌టెక్ వెల్, వెలుపల నీటి శుద్ధి కేంద్రం, పైపులైను నిర్మాణాలకు రూ.1212 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం అనుమతించి జీవో విడుదల చేసింది.
ఈ క్రమంలో మంగోలులో 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి (వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు) కేంద్ర నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. రానున్న 8 నెలల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసి వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే జలాశయం వద్ద ఇన్‌టేక్ వెల్ పనులు పూర్తవగా మిగిలినవి శరవేగంగా సాగుతున్నాయి.
ఇదీ చదవండి: Mla Response to Etv Bharat Story : వృద్ధ దంపతుల కష్టాలపై ఈటీవీ భారత్ కథనం.. ఎమ్మెల్యే సాయం