సీసీఎస్ భేటీ..
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన నేపథ్యంలో.. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పాల్గొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది సైనికులు చనిపోయారు.