Hyderabad Drug Case: హైదరాబాద్ పంజాగుట్ట డ్రగ్ కేసులో 9 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారన్న అభియోగంపై పంజాగుట్ట పోలీసులు తొమ్మిది మంది వ్యాపారులను అరెస్టు చేశారు. వారిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో... పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్‌కు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకోవాల్సినందున వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.
కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం లేదు
మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారన్న బెయిలబుల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తమను కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం లేదని వ్యాపారులు వాదించారు. నిన్న ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం... పోలీసుల పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. అనంతరం వారి తరఫున న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
లావాదేవీలపై ఆరా
డ్రగ్స్ డీలర్ టోనీ కస్టడీ దర్యాప్తులో ఓ వైపు లా అండ్ ఆర్డర్, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. లావాదేవీలపై ఆరా తీశారు. టోనీ పేరుతో బ్యాంకు ఖాతా లేకుండా సహచరుల కథలతో వ్యవహారాన్ని నడిపినట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసేటప్పుడు వాట్సాప్ సందేశాలు, వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడేవాడని తేలింది. అతని సహచరులు ద్వారా అతను చేసిన లావాదేవీల వివరాలతో టోనీని ప్రశ్నించారు. విచారణలో టోనీ నుంచి మాత్రం పోలీసులకు పూర్తి సహకారం ఆడటం లేదు. విదేశీయుడు కావడంతో నైజీరియా ఎంబసీ అధికారులకు సమాచారం ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు.
వాట్సాప్ చాట్ డిలీట్
మహారాష్ట్రలో కూడా ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నా ఇతని లేరు బయటకు రావకపోవడంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేవలం సాంకేతికత ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు పక్కాగా వెళ్లి టోనీని వలపన్ని పట్టుకున్నారు. టోనీ అరెస్ట్ అవ్వడానికి వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో అతని ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. అప్పుడే టోనీ పోలీసులు తన కోసం వస్తారని గ్రహించి తన వాట్సాప్ చాట్‌ను డిలీట్ చేశాడు. మూడు రోజులుగా విచారణలో అతనికి సంబంధించిన వ్యక్తుల వివరాలు సేకరించారు. పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు, ఉత్తర మండల టాస్క్ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు అతడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: Ganja Seized : రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం