దేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. జైడస్ క్యాడిలా టీకాకు నిపుణుల కమిటీ ఈ వారంలోనే ఆమోదం తెలపవచ్చని సంబంధిత వర్గాల వెల్లడించాయి.
12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల కోసం జైడస్ క్యాడిలా రూపొందించిన టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని గత వారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
"దేశీయంగా ఉన్న డిమాండ్‌ను తీర్చడానికి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో నాలుగు భారతీయ కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభిస్తాయిని ప్రభుత్వం అంచనా వేసింది. రాబోయే రోజుల్లో నోవార్టిస్ వ్యాక్సిన్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే జైడస్ క్యాడిలాకు నిపుణుల కమిటీ నుంచి అత్యవసర వినియోగానికి ఆమోదం లభిస్తుంది."
-మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆరోగ్య మంత్రి
ఇటీవల జైడస్ క్యాడిలా అత్యవసర వినియోగానికి భారతీయ ఔషద నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసింది. పూర్తిస్థాయిలో ఆమోదం లభిస్తే.. ఏటా 10-12 కోట్ల డోసులను తయారు చేయాలని యోచిస్తోంది.
ఇదీ చూడండి: టీకా ట్రయల్స్ డేటాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు