ETV Bharat / bharat

TSPSC కార్యాలయ ముట్టడికి యత్నం.. వైఎస్ షర్మిల అరెస్ట్ - వైఎస్ షర్మిలకు లుక్ అవుట్ నోటీసులు

YS Sharmila Arrest in Hyderabad : రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీఎస్‌పీఎస్సీ వద్ద ఆందోళన చేస్తామంటే హౌస్‌ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్​పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

YS Sharmila Arrest in Hyderabad
YS Sharmila Arrest in Hyderabad
author img

By

Published : Mar 31, 2023, 12:34 PM IST

Updated : Mar 31, 2023, 2:21 PM IST

YS Sharmila Arrest in Hyderabad : టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించిన వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు.

Look Out Notices to YS Sharmila : ప్రశ్నాపత్రాల లీకేజీలో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తూ.. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ ఆందోళన అంటే హౌస్‌ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. నేటి ఆందోళన నేపథ్యంలో తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులు మోహరించారన్న షర్మిల.. టీఎస్​పీఎస్సీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం కోసం నిన్న రాత్రే ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. హోటల్ రూమ్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద కనిపించకపోవడంతో పోలీసులు తనకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారన్న ఆమె.. ఆ నోటీసులు ఇవ్వడానికి తానేమైనా క్రిమినల్​నా అంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.

''పేపర్‌ లీకేజీలో చిన్న వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారు. పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఆందోళన అంటే హౌస్‌ అరెస్టు చేస్తున్నారు. ఆందోళన కోసం నిన్న రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చా. హోటల్ రూమ్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారు. లుక్ అవుట్ ఆర్డర్ ఇవ్వడానికి నేను క్రిమినల్‌నా?''- వైఎస్ షర్మిల, వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

TSPSC కార్యాలయ ముట్టడికి యత్నం.. వైఎస్ షర్మిల అరెస్ట్

పేపర్ లీక్​లో వారందరి హస్తం ఉంది..: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వైఎస్ షర్మిల గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు చేశారు. పేపర్ లీక్‌ పెద్ద స్కామ్ అని.. కావాలనే లీక్ చేశారన్నారు. ఇందులో టీఎస్​పీఎస్సీ బోర్డు ఛైర్మన్ దగ్గర నుంచి.. మంత్రుల స్థాయి వరకు పలువురి హస్తం ఉందని ఆరోపించారు.ఈ కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందని.. ప్రస్తుతం ఉన్న బోర్డు మొత్తాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని కోరారు.

ఇవీ చూడండి..

TSPSC పేపర్ లీక్‌ పెద్ద స్కామ్.. ఇందులో వారి హస్తం ఉంది: వైఎస్‌ షర్మిల

పోలీసులు, వైఎస్​ఆర్​టీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్ షర్మిల

Last Updated : Mar 31, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.