YS Viveka Second Wife CBI Statement Viral: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఓవైపు భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి అరెస్ట్.. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ, సుప్రీంకోర్టులో వివేకా కూతురు సునీత పిటిషన్.. 2020లో వివేకా రెెండో భార్య షేక్ షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా బయటికొచ్చింది. ఆ వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
కడప ఎంపీ YS అవినాష్‌రెడ్డి,. ఆయన తండ్రి భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి వెన్నుపోటు వల్లే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినట్లు వివేకానందరెడ్డి.. తనతో చెప్పారని.. వివేకా రెండో భార్య షేక్ షమీమ్ తెలిపారు. ఈ మేరకు.. ఆమె సీబీఐకి 2020 సెప్టెంబరులో వాంగ్మూలం ఇవ్వగా... ఇప్పుడు అది వెలుగు చూసింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాకు ఓటేయాలని..వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి వారి అనుచరుల్ని కోరలేదని.. ఆమె తెలిపారు.
వివేకా ఓటమి తర్వాత, పార్టీ కార్యకర్తలు కొందరు YS మనోహర్‌రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేశారని, ఈ విషయం తాను టీవీల్లో చూసి తెలుసుకున్నానని షమీమ్ చెప్పారు. ఈ ఓటమి వల్ల.. వివేకా తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని వివరించారు. వివేకా బావమరిది.. నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వివేకా కదలికలను నియంత్రించేందుకు,. ఆయన చుట్టూ తన మనుషులను పెట్టేవారని.. షమీమ్ ఆ వాంగ్మూలంలో వివరించారు.
‘వివేకా మృతి తర్వాత శివప్రకాశ్‌రెడ్డి.. భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డిలకు ఫోన్ చేశారని, ఆ వెంటనే వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారని.. తెలిపారు. ఆధారాల ధ్వంసంలో వారంతా పాల్గొన్నారో లేదో నాకు తెలియదని.. షమీమ్ పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి కూడా శివప్రకాశ్‌రెడ్డి మనిషేనని ఆమె తెలిపారు. 2005లో.. వివేకాతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను ఇస్లాం సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు.. షమీమ్ తెలిపారు. ఆ తర్వాత తన అక్క భర్త బాషా సాహెబ్‌ను వివేకా పీఏగా నియమించుకున్నారని వివరించారు. పెళ్లి విషయం తెలిసి.. వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి.. బాషా సాహెబ్‌ను బెదిరించారని, పులివెందుల విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారని.. వాంగ్మూలంలో పేర్కొన్నారు.
విషయం తెలిసి శివప్రకాశ్‌రెడ్డి కాలర్ పట్టుకుని మరీ తిట్టినట్లు వివేకా.. తనకు చెప్పారని షమీమ్ వాంగ్మూలం ఇచ్చారు. వివేకాకు,.. తనకు ఒక కుమారుడు ఉన్నారని, బాబు పేరిట నాలుగెకరాల భూమి రాసిస్తానని ఆయన తనతో చెప్పారని తెలిపారు.. దానికి సునీత, శివప్రకాశ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి అడ్డంకులు సృష్టించారంటూ.. వివేకా తీవ్ర వేదనకు గరైయ్యారని.. షమీప్.. వాంగ్మూలంలో పేర్కొన్నారు.
బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ వ్యవహారంలో తనకు రూ.8 కోట్లు రావాల్సి ఉందని,.. వివేకా తరచూ నాతో చెప్పేవారు. 2019 మార్చి 14 మధ్యాహ్నం 3 గంటల15నిమిషాలకు చివరి సారిగా తాను వివేకాతో మాట్లాడానిని తెలిపారు. తన కోసం వివేకా ఒక ఇల్లు కొనాలనుకున్నారని, కుమారుడి పేరిట కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, భూమి ఇవ్వాలని భావించారని.. షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: