ETV Bharat / bharat

వివేకా హత్య కేసు ఏ5 శివశంకర్‌రెడ్డి బెయిల్‌పై విచారణ- తీర్పు వాయిదా - Vivekananda Reddy Murder

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులకు ప్రాణహాని ఉందని సీబీఐతోపాటు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. అంతేకాక సీబీఐ కోర్టులో పారదర్శక విచారణకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్నారు. వివేకా హత్య కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ 5వ నిందితుడైన శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉండటంతో దర్యాప్తు అధికారులతో పాటు తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, తన కదలికలను గమనిస్తున్నారని, ప్రాణహాని ఉందని సునీత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

YS_Viveka_Murder_Case
YS_Viveka_Murder_Case
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 9:29 AM IST

వివేకా హత్య కేసు ఏ5 శివశంకర్‌రెడ్డి బెయిల్‌పై విచారణ- తీర్పు వాయిదా

YS Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ A5 శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్ తల్వార్ వాదనలు వినిపిస్తూ ఎక్కువ పేజీలున్నాయని మొదటి అభియోగ పత్రంలో నిందితుడిగా చేర్చలేదన్న సాంకేతిక కారణాలతో బెయిలు కోరడం సరికాదన్నారు. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. కుట్రతో పాటు ఘటనా స్థలంలో సాక్ష్యాలను చెరిపివేతలో ఆయన పాత్ర ఉందన్నారు.

Vivekananda Reddy Murder Case in Telangana High Court : శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలున్నప్పుడు సీబీఐ దాఖలు చేసిన మొదటి అభియోగ పత్రంలో నిందితుడిగా ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నకు బదులిస్తూ హత్యకు సంబంధించిన కీలక అంశాలు రాబట్టాలనే వ్యూహంలో భాగంగానే చేర్చలేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. దర్యాప్తు మొదటి నుంచి శివశంకర్‌రెడ్డి అందరినీ బెదిరిస్తున్నారని వివరించారు. గంగాధర్‌రెడ్డి మొదట CRPC.161 కింద వాంగ్మూలం ఇచ్చారని, తరువాత మేజిస్ట్రేట్ ముందు ఇవ్వడానికి నిరాకరించారన్నారు. అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని గుర్తు చేశారు.

వివేకాను చంపి ఆయన కుమార్తె సునీతను వేధిస్తున్న జగన్‌, మనిషేనా: చంద్రబాబు

A5 Shivashankar Reddy Bail Hearing : శంకరయ్య, గంగాధర్‌రెడ్డి, ఇనయతుల్లా, వెంకటరమణ, జగదీశ్వర్‌రెడ్డి, తదితరులను బెదిరించినట్లు వాంగ్మూలాలు ఉన్నాయన్నారు. అవినాష్‌ రెడ్డి అనుచరుడైన శివశంకర్‌రెడ్డికి MLC టికెట్‌ ఇప్పించాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో వివేకా హత్యకు అందరూ కలిసి కుట్ర పన్నారని వివరించారు. శివశంకర్‌రెడ్డికి సన్నిహితుడైన గంగిరెడ్డి ద్వారా కుట్రను అమలు చేయించారని దాని కోసం 40 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందన్నారు.

మొదట శివశంకర్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారని ఇందులో సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి 75 లక్షలు అందజేశారని తెలిపారు. కీలకమైన సాక్షులు 30 మందిని గుర్తించామనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఎప్పటిలోగా వారి వాంగ్మూలాలు నమోదు చేస్తారని ప్రశ్నించారు. గతంలో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని దర్యాప్తు పూర్తయిందన్న కారణంగా బెయిలు మంజూరు చేయరాదన్నారు.

CBI Court Dismissed Sivashankar Reddy Bail Petition: వివేకా హత్య కేసు..శివశంకర్​రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డే గంగిరెడ్డి ద్వారా ఏర్పాట్లు చేశారని సునీత తరపు న్యాయవాది స్వేచ్ఛ కోర్టుకు తెలిపారు. హత్య తర్వాత వాస్తవాలు బయటికి రాకుండా పోలీసు స్టేషన్‌లో ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. గూగుల్ టేక్ అవుట్‌ ప్రకారం హత్య జరిగిన సమయంలో శివశంకర్‌రెడ్డి అవినాష్‌రెడ్డి వద్దే ఉన్నారన్నారని తెలిపారు. పోలీసులు పిలిచిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లాననడం వాస్తవం కాదన్నారు. గంగిరెడ్డి చెప్పింది చేయమని శివశంకర్‌రెడ్డి చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని వెల్లడించారు.

గంగిరెడ్డి నుంచి శివశంకర్‌రెడ్డికి ఫోన్ వచ్చినట్లు కాల్ డేటాలో ఉందన్నారు. హత్యకు ముందు రెక్కీ నిర్వహించారని తెలిపారు. హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి శివశంకర్‌రెడ్డి వెళ్లారని.. అక్కడి నుంచి వివేకా ఇంటికి వచ్చారని తెలిపారు. హత్యకు కొంత సేపటి ముందు అవినాష్‌రెడ్డితో వాట్సాప్ చాటింగ్ జరిగిందని వివరించారు. ఈ కేసు నేపథ్యంలో సునీత కదలికలను కూడా గమనిస్తున్నారని.. ఆమెకు ప్రాణహాని ఉందని కోర్టుకు నివేదించారు.

అంతకు ముందు శివశంకర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ రెండున్నరేళ్లగా జైల్లోనే ఉన్నారన్నారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని అభియోగ పత్రాలు కూడా దాఖలు చేశారని తెలిపారు. కోర్టుల్లో ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదన్నారు. గూగుల్‌ టెక్‌ అవుట్‌కు సంబంధించి శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు లేవన్నారు. వివేకా కుటుంబంలోనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

YS Viveka murder case update : గుండెపోటు నుంచి గొడ్డలివేటుగా మారిన క్రైమకథ.. బాబాయ్​ కేసు గుట్టురట్టైందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.