ETV Bharat / bharat

ఇదేం తిక్కరా నాయనా.. లక్ష టపాసులతో కారును అలంకరించి.. మంట పెట్టి.. - కారుకు లక్ష టపాసులు కట్టిన యూట్యూబర్

దీపావళి అనగానే అందరి టపాసులే గుర్తుకువస్తాయి. చిన్న నుంచి పెద్దల వరకు ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తూ ఎంజాయ్‌ చేస్తారు. అయితే, టపాసులు కాల్చే విషయంలో ఎవరి స్టైల్‌ వారికే ఉంటుంది. దీపావళి సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

youtuber-bursts-firecrackers-on-car
youtuber-bursts-firecrackers-on-car
author img

By

Published : Oct 25, 2022, 10:49 AM IST

కారుకు క్రాకర్స్ కట్టి ఇలా..

దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్‌ కొత్తగా ఆలోచించాడు. అందరిలా బాణాసంచా సాధారణంగా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడు. ఈ క్రమంలో డిఫరెంట్‌గా థింక్‌ చేశాడు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్‌ అమిత్‌ శర్మ. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్‌ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులకు వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం, 1.. 2.. 3.. అంటూ బాంబులను పేల్చాడు.

ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్దంతో మారుమోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరుకు వెళ్లాడు. బాంబులు పేలడం వల్ల కారు కలర్‌ మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్‌ మెత్తబడిపోయి పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్‌ మాత్రం పనిచేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్‌ మళ్లీ కారును స్టార్ట్‌ చేసి డ్రైవింగ్‌ చేస్తూ తన దోస్తులతో ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.