ETV Bharat / bharat

తమ్ముడి బైక్​ కోసం వెళ్లిన సోదరుడి దారుణ హత్య.. లవర్స్ డే రోజు ప్రియుడి ఆత్మహత్యాయత్నం! - young man murder in delhi

తమ్ముడి బైక్​ను తీసుకొచ్చేందుకు వెళ్లిన అన్నను గుర్తు తెలియని వ్యక్తులు.. నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. దిల్లీలో జరిగిందీ ఘటన. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో ఓ ప్రియుడు.. తన ప్రియురాలి ఇంట్లోకి చొరబడి నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

youth was allegedly stabbed to death
youth was allegedly stabbed to death
author img

By

Published : Feb 15, 2023, 12:02 PM IST

దేశ రాజధాని దిల్లీలో క్రమక్రమంగా నేరాలు పెరుగుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో హత్యలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు.. నడిరోడ్డుపై కత్తితో దారుణంగా చంపారు. నాంగ్లోయ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే?.. విశాల్ మాలిక్​ అనే వ్యక్తి.. బైక్​పై జిమ్​ నుంచి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో అతడి బైక్​.. ఓ వాహన డ్రైవర్​ను ఢీకొట్టింది. దీంతో విశాల్​కు, వాహన డ్రైవర్​కు మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో ఆ డ్రైవర్ తరఫున వ్యక్తులు.. విశాల్​పై దాడి చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విశాల్​ పోలీస్​స్టేషన్​కు చేరుకున్నాడు. ఆ తర్వాత విశాల్ ​తన సోదరుడు సాహిల్​కు కాల్​ చేసి విషయాన్ని తెలిపాడు. పోలీస్​స్టేషన్​కు రమ్మని కోరాడు.

అయితే పోలీస్​​స్టేషన్​కు చేరుకున్న సాహిల్​ను.. విశాల్​ బైక్​ తెచ్చుకోమని పోలీసులు చెప్పారు. సాహిల్​ ఒంటరిగానే ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్​ తరఫున వ్యక్తులు.. సాహిల్​పైన కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాహిల్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాహిల్ మరణించాడని వైద్యులు తెలిపారు. సాహిల్ హత్యకు పోలీసులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రియురాలి ఇంట్లో ఆత్మహత్యాయత్నం..
ప్రేమికుల దినోత్సవం రోజున ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్​లో ఓ ప్రియుడు.. తన ప్రియురాలి ఇంట్లోకి చొరబడి నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. థానా రామచంద్ర మిషన్​ ప్రాంతానికి చెందిన సద్దాం అనే యువకుడు.. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం సద్దాం తన ప్రేయసి ఫొటోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశాడు. అది కాస్త వైరల్​గా మారింది. దీంతో మంగళవారం బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే మంగళవారం అర్థరాత్రి.. సద్దాం తన ప్రేయసి ఇంట్లోకి చొరబడి నిప్పంటించుకున్నాడు. వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సద్దాంను ఆస్పత్రికి తరలించారు. అయితే తనను అమ్మాయి కుటుంబసభ్యులే ఇంటికి పిలిచి నిప్పంటించారని యువకుడు ఆరోపించాడు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.