తన ప్రియురాలితో మాట్లాడించకపోతే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు ఓ యువకుడు. ఈ ఘటన బంగాల్లోని పుజాలిలో జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదుటే గొంతుపై కత్తి పెట్టుకుని నిలబడ్డాడు.
షేక్ సొహైల్ అనే వ్యక్తి మాయాపుర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు పుజాలి గ్రామంలో నివసిస్తున్న ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. 22 రోజుల క్రితం ఇద్దరు కలిసి పారిపోయారు. మూడు రోజుల పాటు ఈ జంట తిరిగి వచ్చింది. వీరి ప్రేమ వ్యవహారాన్ని యువకుడి కుటుంబం అంగీకరించగా.. బాలిక కుటుంబం మాత్రం వ్యతిరేకించింది. తమ కుమార్తెను ఎత్తుకెళ్లారంటూ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షేక్ సొహైల్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
తాజాగా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు సొహైల్. ఇదే కేసు విషయమై బాలికను ఆమె తండ్రిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఈ విషయం తెలుసుకున్న సొహైల్.. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. బాలికతో ఒక్కసారైనా మాట్లాడించాలంటూ వేడుకోగా.. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు.. తన ప్రియురాలితో మాట్లాడించకపోతే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు.. బాలికను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం సొహైల్ను ఇంటికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
ఇవీ చదవండి: కారు కట్నంగా ఇవ్వలేదని ఫోన్లోనే తలాక్.. వేరే మహిళతో పెళ్లి!
అక్కడి నర్సులకు అందమే ముఖ్యం.. రూ.1500 లంచం ఇస్తేనే వైద్యం..