పాఠశాల విద్యార్థినికి ఓ యువకుడు తాళి కట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం బాలికకు పసుపుతాడు కడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ ఆలయం వెనకకు తీసుకెళ్లి తాళి కడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అది చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ ఘటనపై ఊటికి చెందిన సాంఘీక సంక్షేమ శాఖ విభాగం.. కూనూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ కేసును పోలీసులతో పాటు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వీడియోలో ఉన్న యువకుడిని సుత్తోన్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన గౌతమ్‌గా గుర్తించారు. నిందితుడు కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడని వివరించారు. బాలిక తన తండ్రితో నమ్మక్కల్‌లో ఉంటారని పేర్కొన్నారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం కింద యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలికను ఊటిలోని బాలికల సంక్షేమగృహానికి తరలించారు.
ఇదీ చూడండి: వాజేకు తెల్లకుర్తా వేసి ఎన్ఐఏ సీన్ రీక్రియేషన్