ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఆగస్టు 8 - 14) - ఆగస్టు రాశి ఫలాలు

ఈ వారం (ఆగస్టు 8 - 14) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope
రాశి ఫలాలు
author img

By

Published : Aug 8, 2021, 4:34 AM IST

ఈ వారం (ఆగస్టు 8 - 14) రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

బుద్దిబలంతో అద్భుతమైన విజయం లభిస్తుంది. ప్రణాళిక ప్రకారమే పని ప్రారంభించండి. అదృష్టవంతులవుతారు. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉత్తమఫలితం ఉంటుంది. వ్యాపారంలో కృషి ఫలిస్తుంది. మీవల్ల పదిమందికి మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఆదిత్యహృదయం చదవండి, భవిష్యత్తు బాగుంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఉద్యోగంలో క్రమంగా విజయాలు వరిస్తాయి. ఇతరుల సహకారంతో ఆశయం నెరవేరుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల సూచనలు అవసరం. మొహమాటంతో ఆర్థిక నష్టం సూచితం. చేతిదాకా వచ్చిన పని ఒకటి చేజారిపోతుంది. వారాంతంలో మంచి జరుగుతుంది. శివస్మరణ శుభప్రదం.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ముఖ్యకార్యాల్లో విజయం సొంతమవుతుంది. ఉద్యోగంలో కలిసివస్తుంది. వ్యాపారం బాగుంటుంది. కార్యసిద్ధీ గౌరవ పురస్కారాలూ దక్కుతాయి. నలుగురికీ మేలుచేస్తారు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎదురుచూస్తున్నది లభిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. స్థిరత్వం వస్తుంది. అధికారుల ప్రశంసలు శక్తినిస్తాయి. ఇష్టదేవతాస్మరణ మేలుచేస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

మనోబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆపదల నుంచి త్వరగా బయటపడతారు. అవసరాలకు ధనం అందుతుంది. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. మిత్రుల అండ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, అభీష్టసిద్ధి కలుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితం గోచరిస్తోంది. నేర్పుతో పెద్దలను మెప్పించాలి. ఆటంకాలను సమర్థంగా అధిగమిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో అదృష్ట యోగం ఉంటుంది. శివారాధన మనశ్శాంతి కలిగిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)

ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధిస్తారు. వ్యాపారబలం పెరుగుతుంది. ధనలాభం స్వల్పం. విసుగు తెప్పించేవారున్నారు. ఏకాగ్రతతో, సంయమనాన్ని పాటిస్తూ లక్ష్యాన్ని చేరాలి. కొన్ని విషయాల్లో మౌనమే మేలు. మిత్రుల ద్వారా ఒక కార్యం నెరవేరుతుంది. గురుశ్లోకం చదవండి, ఆరోగ్యం బాగుంటుంది.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

అద్భుతమైన కాలం మొదలైంది. ఎటుచూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కార్యాచరణను బట్టి కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. శ్రమ ఫలిస్తుంది. భూ గృహ వాహన లాభాలు సూచితం. కల సాకారమవుతుంది. కొన్ని మంచి పనులు చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలున్నాయి. విష్ణు సహస్ర నామాలుచదివితే అన్ని విధాలా కలిసి వస్తుంది.

వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేక ఫలితముంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగరీత్యా పెద్దల సహకారం లభిస్తుంది. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. వ్యాపారపరంగా స్వల్ప లాభముంటుంది. శ్రమ పెరుగుతుంది. ధర్మబద్ధంగా వ్యవహరించండి. వారాంతంలో కార్యసిద్ధి ఉంటుంది. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. కొన్ని పనులు దగ్గరిదాకా వచ్చి ఆగుతాయి. బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించాలి. నిదానంగానే కార్యసిద్ధి ఉంటుంది. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. వారాంతంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తే సమస్యలు ఉండవు. వ్యాపారంలో అనుకూలతలున్నాయి. శివధ్యానం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

విశేషమైన కార్యసిద్ధి ఉంది. దానికి అనుగుణంగా ధైర్యంగా కార్యాచరణ ఉండాలి. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపారస్థితి మిశ్రమం. మొహమాటంతో సమస్యలు ఎదురవుతాయి. ముక్కుసూటిగా వ్యవహరిస్తే ఆపదలు తొలగుతాయి. ధర్మమార్గంలో శాంతి లభిస్తుంది. శని శ్లోకం చదవండి, శుభం జరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. గుర్తింపు పెరుగుతుంది. ధర్మం గెలిపిస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలున్నాయి. ఓర్పుతో వాటిని సొంతం చేసుకోవాలి. దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఒక సమస్య నుండి బయటపడతారు. చంచల స్వభావం ఇబ్బంది పెడుతుంది. ఒక శుభవార్త వింటారు. ఆంజనేయస్వామిని స్మరించండి, మేలు జరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పట్టుదలతో పనిచేస్తే విజయం త్వరగా వస్తుంది. ఏకాగ్రత లక్ష్యాన్ని చేరుస్తుంది. స్వల్ప ఆటంకాలను పట్టించుకోవద్దు. కొందరు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వ్యాపారరీత్యా శ్రమ ఫలిస్తుంది. సకాలంలో పని పూర్తిచేస్తే అధికలాభాలుంటాయి. నమ్మిన సిద్ధాంతాన్నే ఆచరణలో పెట్టండి. అంతిమంగా శుభం జరుగుతుంది. గణపతి దర్శనం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.