ETV Bharat / bharat

అర్ధరాత్రి ఘోరం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం - క్యాబ్‌ డ్రైవర్ లైంగిక వేధింపులు

అర్ధరాత్రి క్యాబ్ ఎక్కిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తనపై ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి(Uber Cab Rape Victim) పాల్పడ్డాడని ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆంధ్రప్రదేశ్​కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

raped
raped
author img

By

Published : Sep 22, 2021, 6:32 PM IST

అర్ధరాత్రి ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక బెంగళూరులో వెలుగుచూసింది. బాధితురాలి(Uber Taxi Rape Victim) ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిందితుడైన క్యాబ్ డ్రైవర్‌(Uber Cab Driver Case) దేవరాజ్​ను అరెస్టు చేశారు.

అసలు ఏం జరిగింది?

నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో తన స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లింది. అనంతరం మురుగేశ్ పాళ్యలోని తన ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 2 గంటలకు క్యాబ్ బుక్ చేసింది. మార్గంమధ్యలో డ్రైవర్ దేవరాజ్ తనపై శారీరకంగా దాడి చేసి, అత్యాచారం చేశాడని ఆ మహిళ(Bengaluru Rape Victim) ఆరోపించింది. నిందితునితో పోరాడి అతని ఫోన్‌ను లాక్కున్నట్లు మహిళ తెలిపింది. క్యాబ్​ డ్రైవర్ తప్పించుకున్నాడని.. ఇంటికి చేరుకున్న తాను జేసీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది.

మద్యం మత్తులో..?

బాధిత మహిళ క్యాబ్‌ ఎక్కగానే నిద్రపోయిందని.. దీనిని అదునుగా తీసుకున్న నిందితుడు క్యాబ్​ను(Uber Cab Driver News) ఆమె ఇంటి సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. డ్రైవర్ తన క్యాబ్​ను​ దాదాపు 20 నిమిషాల పాటు ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉంచినట్లు గుర్తించారు. ఇతర ఆధారాలను సైతం సేకరించినట్లు తెలిపారు. అయితే.. క్యాబ్ డ్రైవర్ తాను నిర్దోషినని, తన క్యాబ్​లో ఎక్కిన మహిళ మద్యం సేవించిందని పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.