ETV Bharat / bharat

గర్ల్​ఫ్రెండ్​ ఖర్చుల కోసం యువకుడు కిడ్నాప్​ డ్రామా.. చివరకు..

గర్ల్​ఫ్రెండ్​ ఖర్చుల కోసం డబ్బులు సమకూర్చేందుకు ఓ యువకుడు కిడ్నాప్​ నాటకం ఆడాడు. మీ కుమారుడు అపహరణకు గురయ్యాడంటూ సొంత తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.2.5 లక్షలు డిమాండ్​ చేశాడు.

Conspiracy to kidnap himself to meet girlfriend
గర్ల్​ఫ్రెండ్​ కోసం యువకుడి కిడ్నాప్​ డ్రామా.. చివరకు..
author img

By

Published : Nov 10, 2021, 4:28 PM IST

గర్ల్​ఫ్రెండ్ ఖర్చుల కోసం ఎలాగైనా డబ్బులు కావాలని ఓ యువకుడు కిడ్నాప్​ నాటకం ఆడాడు. తానే తల్లింద్రులకు ఫోన్​ చేసి 2.5 లక్షలు డిమాండ్​ చేశాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

ఇదీ జరిగింది..

మధ్యప్రదేశ్​లోని భీండ్​ జిల్లా గోహద్​ ప్రాంతానికి చెందిన సందీప్..​ తన గర్ల్​ఫ్రెండ్​ ఖర్చులు భరించేందుకు కొంత డబ్బు అవసరమని భావించాడు. ఇందుకోసం తాను కిడ్నాప్​కు గురైనట్లు నాటకం ఆడాడు. కిడ్నాపర్​లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించాడు. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. దీంతో ఈనెల 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇందుకు సంబంధించి​ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సందీపే కిడ్నాపర్​ అని వెల్లడైంది. అతని మొబైల్​ నెట్​వర్క్​ లొకేషన్​ ఆధారంగా పోలీసులు గ్వాలియర్​లో సందీప్​ ఆచూకీని గుర్తించారు. కిడ్నాప్​ డ్రామాపై యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. వాయిస్​ ఛేంజర్​ యాప్​ ద్వారా సందీప్​ గొంతు మార్చి కిడ్నాపర్​లాగ మాట్లాడాడని పోలీసులు వెల్లడించారు.

'గురుగ్రామ్​లోని నా గర్ల్​ఫ్రెండ్​ను కలుసుకునేందుకు, ఆమె ఖర్చుల కోసం ఇచ్చేందుకు నాకు డబ్బు కావాలి. తల్లిదండ్రులను అడిగితే వారు అందుకు తిరస్కరించారు. అందుకే ఈ కిడ్నాప్​ డ్రామా ఆడాను' అని యువకుడు వెల్లడించాడు. అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : 10 వేల కానిస్టేబుల్ పోస్టులకు 12 లక్షల దరఖాస్తులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.