Rajesh Murder Case Update : హైదరాబాద్ నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పెద్ద అంబర్‌పేట్ డాక్టర్స్ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్మయం కలిగించే కీలక ఆధారాలు సేకరించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాతతో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావు.. రాజేశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తొలుత భావించినప్పటికీ ఆ తరువాత విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత.. రాజేశ్‌కు ఒక మిస్డ్ కాల్ ద్వారా పరిచయమయ్యారు. ఇద్దరికీ ఆరు నెలలుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. సుజాత ఫొటోలు చూసిన రాజేశ్ ఆమెకు వివాహం కాలేదని భావించాడు. ఈక్రమంలో సుజాతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
- Woman Murder Case: వివాహిత హత్య కేసులో బయటపడిన నిజం.. ఆమెను మట్టుపెట్టింది అతనే
- Selfie Suicide In Hanamkonda : 'నా లవర్, ఆమె ఫ్రెండ్ వేధింపుల వల్లే చనిపోతున్నా'
కానీ ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారన్న విషయం రెండు నెలల క్రితమే రాజేశ్‌కు తెలియడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. రాజేశ్ దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటానని సుజాత చెప్పింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తరువాత ఆమె.. ఆసుపత్రిలో ఉన్న విషయం తెలియక రాజేశ్ ఆమె సెల్‌ఫోన్‌కు వాట్సప్ సందేశాలు, కాల్స్ చేశాడు. పదే పదే రాజేశ్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేసి ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
రాజేశ్ టీ షాప్ దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన సుజాత కుటుంబ సభ్యులు.. వెంచర్ వద్దకు తీసుకెళ్లి మందలించారు. ఆ తర్వాత సుజాత పరిస్థితి మరింత విషమంగా ఉందని రాజేశ్‌కు ఫోన్ చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న సుజాత మృతి చెందింది. దీంతో బయపడిన రాజేశ్ పురుగుల మందు తాగాడు. అనంతరం బహిర్భూమి కోసం రాజేశ్ ప్యాంటు తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రాజేశ్ దుస్తులు లేకుండా పడి ఉన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: