CM Yogi Adityanath nomination: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ క్రమంలోనే గోరఖ్‌పుర్ అర్బన్ స్థానం నుంచి శుక్రవారం.. నామినేషన్ దాఖలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు.
![Yogi Adityanath to filed nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14368172_cm.jpg)
అంతకుముందు యోగి.. గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చి నామినేషన్ సమర్పించారు.
![Yogi Adityanath to filed nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14368172_yogi23.jpg)
![Yogi Adityanath to filed nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14368172_shah-amit.jpg)
యోగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు గోరఖ్‌పుర్ నుంచే ఐదు సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు యోగి.
నామినేషన్ వేయడానికి ముందు.. అమిత్ షాతో కలిసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు సీఎం. ఈ సందర్భంగా.. ఐదేళ్ల కాలంలో భాజపా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు యోగి ఆదిత్యనాథ్. డబుల్- ఇంజిన్ సర్కార్‌పై ఏ ఒక్కరూ వేలెత్తిచూపలేరని అన్నారు.
![Yogi AdityanathYogi Adityanath to filed nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/f2705b1e0d9fdc477d149a8a88eaedb7_0202a_1643795683_719.jpg)
''గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించాం. 2019 సాధారణ ఎన్నికల్లో మహాఘట్బంధన్ను చిత్తుగా ఓడించాం. భాజపా ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రామమందిర నిర్మాణాన్ని సాకారం చేస్తోంది.''
- యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా యూపీ సీఎంను.. అమిత్ షా పొగడ్తల్లో ముంచెత్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌ను మాఫియా నుంచి విముక్తి చేసిన ఘనత యోగిదే అన్నారు. 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సరైన పాలనను తిరిగి అందించారని ప్రశంసించారు.
![Yogi Adityanath to filed nomination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14368172_yogi.jpg)
''2014, 2019 సార్వత్రిక, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. రానున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా మరోసారి విజయం సాధిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీతో విజయం కట్టబెడుతారు.
యోగి ఆదిత్యనాథ్ కొవిడ్ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశారు. భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ను నిలిపారు. కొవిడ్‌పై అత్యంత సమర్థంగా పోరాడారు.''
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి మొత్తం 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో కలిసి భాజపా కూటమిగా పోటీ చేస్తోంది.
మార్చి 3న ఆరో దశలో భాగంగా.. గోరఖ్‌పుర్ అర్బన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
2017 ఎన్నికల్లో భాజపా ఏకంగా 312 స్థానాల్లో గెలుపొంది.. పూర్తి మెజారిటీ సాధించింది. మొత్తం 403 స్థానాలుండగా.. 39.67 ఓట్ల శాతాన్ని సొంతం చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 చోట్ల నెగ్గింది. బీఎస్పీ 19 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది.
ఇదీ చూడండి: ఎన్నికల ముందు సీఎం చన్నీకి ఈడీ షాక్.. మేనల్లుడి అరెస్ట్