ETV Bharat / bharat

Yamuna Expressway Accident : యమునా ఎక్స్​ప్రెస్​వేపై ప్రమాదం.. చిన్నారి సహా ఐదుగురు మృతి - road accident in srinagar yesterday

Yamuna Expressway Accident : దిల్లీ నొయిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మరణించారు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ గుర్తు తెలియని వాహనం.. దిల్లీ నుంచి ఝార్ఖండ్​ వెళ్తున్న కారును ఢీకొట్టడం వల్ల ఐదుగురు అక్కడిక్కడే మరణించారు.

Yamuna Expressway Accident
Yamuna Expressway Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 11:20 AM IST

Updated : Oct 21, 2023, 12:37 PM IST

Yamuna Expressway Accident : దిల్లీ యమునా ఎక్స్​ప్రెస్​వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మరణించారు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ గుర్తు తెలియని వాహనం.. దిల్లీ నుంచి ఝార్ఖండ్​ వెళ్తున్న కారును ఢీకొట్టడం వల్ల ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్​ పరీక్షల కోసం తరలించారు. మృతులను ఝార్ఖండ్​కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం వీరంతా దిల్లీలో నివసిస్తున్నారని.. సెలవుల నేపథ్యంలో సొంతూరుకు వెళ్తున్నట్లు సమాచారం. మృతులను సురేశ్​(45), ఉపేంద్ర(38), విజేంద్ర(36), అతడి భార్య కంతి దేవి(30), కూతురు జ్యోతి(12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

"కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మరణించారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు."

--పోలీసులు

రెండు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
Road Accident In Jammu And Kashmir : మరోవైపు శుక్రవారం జమ్ము కశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. ఓ ట్రక్కు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొనడం వల్ల డ్రైవర్​, క్లీనర్ సహా నలుగురు మరణించారు. ఈ ఘటన శ్రీనగర్​ జాతీయ రహదారిపై ఉన్న ఝాజ్జర్​కోట్లిలో జరిగింది. కిష్ట్వార్ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఓ కారు అదుపుతప్పి చినాబ్​ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతులను మదన్​ లాల్, రాకేశ్ కుమార్, ధ్యాన్ సింగ్​గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి.. అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని చెప్పారు.

Mangalore Car Accident Viral Video : ఫుట్​పాత్​పైకి దూసుకెళ్లిన కారు.. యువతి స్పాట్ డెడ్​.. లైవ్ వీడియో

Navy Officer Fraud : ముగ్గురిని హత్య చేసిన మాజీ నేవీ ఆఫీసర్​.. తప్పించుకునేందుకు పక్కా స్కెచ్.. 20 ఏళ్ల తర్వాత..

Last Updated : Oct 21, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.