ETV Bharat / bharat

2047కు సరికొత్త భారత్‌ ఉప రాష్ట్రపతి - Vice President M Venkaiah Naidu

మరో పాతికేళ్లలో నవ భారత్​ను నిర్మించేందుకు దేశం విస్తృత మార్గసూచీని సిద్ధం చేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దండి పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

would prepare a detailed outline to build a "new India" by 2047, says Vice President M Venkaiah Naidu
2047కు సరికొత్త భారత్‌: ఉప రాష్ట్రపతి
author img

By

Published : Apr 7, 2021, 5:49 AM IST

Updated : Aug 13, 2022, 4:34 PM IST

భారతదేశం స్వాతంత్య్రం పొంది వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి సరికొత్త భారత్‌ను నిర్మించేందుకు దేశం విస్తృత మార్గసూచీని సిద్ధం చేస్తుందన్న నమ్మకం తనకుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంలో 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' పేరుతో కేంద్ర ప్రభుత్వం 75 వారాల ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన 'దండి పాదయాత్ర' ముగింపు కార్యక్రమం మంగళవారం దండిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

"1947 నుంచి మన స్వాతంత్య్ర సమరయోధుల అడుగుజాడల్లోనే మనం నడిచాం. 'సబ్‌ కా సాథ్‌.. సబ్‌కా వికాస్' (అందరితో కలిసి.. అందరి అభివృద్ధి) అన్నది మన నినాదం. మనం చాలా అంశాలను సాధించాం. 75 ఉపాయాలు, 75 విజయాలు, 75 చర్యలు, 75 పరిష్కారాలు మన లక్ష్యం కావాలి"

-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి

ఈ రోజు ప్రపంచం మొత్తం మన బలాలను గుర్తించిందని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు.

అదే గొప్ప విజయం..

"ఈ కార్యక్రమం సందర్భంగా.. భారత్‌ స్వాతంత్య్రం పొంది వందేళ్లు అయ్యే 2047ను పరిగణనలోకి తీసుకుని, అంటే వచ్చే 25 ఏళ్లలో సరికొత్త భారత్‌ను నిర్మించేందుకు మనం విస్తృత మార్గసూచీని సిద్ధం చేస్తామన్న నమ్మకం ఉంది. రానున్న 25 ఏళ్లలో దానిని సాధించేందుకు మనం కృషి చేస్తాం" అని వెంకయ్య అన్నారు. మన కలల భారత్‌ను నిర్మించేలా మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ వంటి నాయకులు స్ఫూర్తిని కలిగిస్తున్నారని చెప్పారు. విదేశీయుల నుంచి స్వాతంత్య్రాన్ని అహింసా పోరాటంతో సాధించడమే దేశం సాధించిన గొప్ప విజయమని అన్నారు.

గత నెల 12న అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి యాత్రను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న 81 మందితో వెంకయ్యనాయుడు మంగళవారం ముచ్చటించారు. ఈ సందర్భంగా దండి స్మారకం, ప్రదర్శనశాలను తిలకించారు.

ఇదీ చూడండి: తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం

Last Updated : Aug 13, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.