ఇకనుంచి ఎలాంటి శుభ కార్యక్రమాలకూ భాజపా నేతలను ఆహ్వానించకూడదని పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు చౌదరి నరేష్. ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్లోని సిసౌలీ ప్రాంతంలో నిర్వహించిన మహా పంచాయత్ కార్యక్రమానికి హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"భాజపా నేతలను ఎవరైనా శుభకార్యాలకు ఆహ్వానించినట్లు తెలిస్తే.... వారు ఆ తర్వాత రోజు వంద మందికి ఆహారం పెట్టాల్సి ఉంటుంది. ఇదే వారికి విధించే శిక్ష."
-చౌదరి నరేష్, బీకేయూ జాతీయ అధ్యక్షుడు.
ముజఫర్నగర్లోని సిసౌలీలో బుధవారం నిర్వహించిన ఈ మహా పంచాయత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాలోని ఇతర గ్రామాల్లో నుంచీ రైతులు తరలివచ్చారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతోన్న ఆందోళనకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:'సమాఖ్య విధానమే దేశాభివృద్ధికి మూలం'