ETV Bharat / bharat

రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి- నిజమెంత?

రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి జరిగిందన్న విపక్షాల ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. వీటిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే.. విపక్షాల ఆరోపణలన్నీ అబద్దాలేనని కేంద్రం మండిపడింది. ఈ మేరకు రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసింది.

Women MPs 'manhandled' in RS
రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి
author img

By

Published : Aug 12, 2021, 3:04 PM IST

Updated : Aug 12, 2021, 3:38 PM IST

రాజ్యసభ సమావేశాలు జరిగిన చివరి రోజున మహిళా ఎంపీలపై మార్షల్స్ చెయ్యి చేసుకున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. విపక్షాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభ సీసీటీవీ కెమెరా ఫుటేజీని విడుదల చేసింది.

సభాపతి స్థానం వద్దకు విపక్ష ఎంపీలు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఎంపీలను మార్షల్స్ చుట్టుముట్టినట్లు, ఇద్దరు మహిళా ఎంపీలు ఓ మహిళా మార్షల్​ను తోసేసినట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. పెద్దల సభలో విపక్షాలు ప్రవర్తించిన తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే అవమానకరమని పేర్కొన్నారు. దేశ ప్రజలు తమ పక్షాన లేరన్న వాస్తవాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.

'అరాచకత్వమే అజెండా'

మరోవైపు, రాజ్యసభలో నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్​ సజావుగా సాగనివ్వొద్దని కాంగ్రెస్ సహా పలు సన్నిహిత పార్టీలు ముందుగానే నిర్ణయించుకున్నాయని అన్నారు. కుదిరితే నా దారి, లేదంటే రహదారి అన్న విపక్షాల వైఖరి సరికాదని హితవు పలికారు.

"పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జరిగిన దానికి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వీధుల నుంచి పార్లమెంట్ వరకు అరాచకత్వం సాగించడమే విపక్షాల ఏకైక అజెండా. రాజ్యసభ కార్యదర్శి టేబుల్.. డ్యాన్సులు చేయడానికో, నిరసన చేయడానికో కాదు. ఆందోళన చేసిన ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్ చర్యలు తీసుకోవాలి."

-ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి

విపక్షాల ఆరోపణ

పార్లమెంట్​లో కావాలనే చర్చకు సహకరించలేదని మోదీ సర్కార్​పై 11 విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ప్రతిపక్షాల డిమాండ్ల​ను కేంద్రం పట్టించుకోలేదని.. పార్లమెంట్​ భద్రతతో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మహిళా ఎంపీలపై దాడి చేయించిందని సంచలన ఆరోపణలు చేశాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పెగసస్ నిఘా వ్యవహారంపై కేంద్రం చర్చించకుండా పారిపోయిందని ఎద్దేవా చేశాయి.

"రాజ్యసభలో బుధవారం జరిగిన ఘటన ఊహించనిది. సభా గౌరవానికి అవమానకరం. విపక్షాలు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకపోయినా.. ఎంపీలను నియంత్రించేందుకు బయటి వ్యక్తులను పిలిపించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసినందుకే.. మహిళా ఎంపీల గళాన్ని అణచివేశారు. ప్రభుత్వ నియంతృత్వ, అప్రజాస్వామిక పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంపై జరిగే దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తూనే ఉంటాం."

-విపక్షాల ఉమ్మడి ప్రకటన

రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ సహా డీఎంకే, సీపీఎం, ఆర్​జేడీ, ఐయూఎంఎల్, సీపీఐ, ఆర్​ఎస్​పీ, కేరళ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు.

అంతకుముందు, పలువురు విపక్ష ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిశారు. బుధవారం సభలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి ముందు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు పార్లమెంట్ నుంచి విజయ్​ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 12, 2021, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.