women child killed in jharkand: మార్కెట్‌కు వెళ్లొస్తుండగా ఓ కుటుంబంపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ కాల్పుల్లో మహిళ(30), ఆమె మూడేళ్ల కుమార్తె మరణించగా, ఆమె భర్త అశోక్ లాక్రా గాయపడ్డారు. అయితే ఈ దాడిలో వారి ఐదేళ్ల కొడుకు క్షేమంగా ఉన్నాడు. ఈ ఘటన ఝూర్ఖండ్లోని జుమ్లా జిల్లాలోని జనవల్ గ్రామంలో జరిగింది.
గాయపడిన అశోక్ లక్రా.. తీవ్రవాద గ్రూపు ఝూర్ఖండ్ జన్-ముక్తి పరిషత్ (జేజేఎంపీ) మాజీ సభ్యుడని, పలు హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్).. ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలోపే గాయపడిన లక్రా అక్కడి నుంచి పరారయ్యాడు. జనవల్ నవాటోలి గ్రామంలో రహస్యంగా చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత లక్రాను గుమ్లాలోని సదర్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సిట్ బృందం.. అశోక్ లక్రా నివాసంలోని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది.
ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్ కళ్ల ముందే యువతిపై గ్యాంగ్‌రేప్