తమిళనాడు కోయంబత్తూర్లోని (Tamil nadu Coimbatore) చిన్నియంపాలయం వద్ద గుర్తు తెలియని మహిళ శవం రహదారిపై (dead body on road) కనిపించింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు పీలమేడు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి ప్రాథమిక వివరాలు సేకరించారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోయంబత్తూర్ బోధనాసుపత్రికి తరలించారు.
రహదారిపై వాహనాలు వేగంగా దూసుకెళ్లగా.. మహిళ శరీరం గుర్తుపట్టలేని విధంగా మారింది. రోడ్డు ప్రమాదంలోనే (road accident) మహిళ మరణించిందని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. విస్తుపోయే వాస్తవం బయటపడింది.
ఓ స్కార్పియో నుంచి మహిళ శవాన్ని తోసేసిన (dead body thrown out of car) దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డాయి. పథకం ప్రకారమే హత్య చేసి.. మృతదేహాన్ని ఇలా పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళ వివరాలు గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: