ETV Bharat / bharat

మహిళను వివస్త్రను చేసి.. దారుణంగా కొడుతూ ఊరేగింపు - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు

Woman Stripped: మానసిక స్థితి సరిగాలేని ఓ మహిళపై అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు కొందరు వ్యక్తులు. చిన్న కారణంతో.. ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొడుతూ ఊళ్లో తిప్పారు. సంబంధిత వీడియో వైరల్​గా మారగా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు.

woman-stripped-in-sonbhadra
మహిళను వివస్త్ర, woman-stripped, sonbhadra NEWS
author img

By

Published : Dec 8, 2021, 12:53 PM IST

Woman Stripped: ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్రలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు కొందరు దుండగులు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు.

రాయ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చౌఖ్​డా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వివరాల ప్రకారం.. బాధిత మహిళ కొద్దిరోజుల కిందట ప్రేమ్​నాథ్​ అనే వ్యక్తికి చెందిన గడ్డిని తగులబెట్టిందని తెలుస్తోంది. దీనిపైనే కక్ష పెంచుకున్న ప్రేమ్​నాథ్​ తన సహచరులతో కలిసి మతిస్థిమితం లేని ఆ మహిళను వివస్త్రను చేశారు. అలాగే కొడుతూ ఊరంతా తిప్పారు.

ఈ విషయం గ్రామపెద్ద వద్దకు చేరినా.. ఆయన రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబానికి రూ. 3500 ముట్టజెప్పి వ్యవహారం బయటకు తెలియకుండా చేశారు.

UP Sonbhadra News:

అయితే.. ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేయగా వైరల్​గా మారింది. ఇది చూసే.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఓ నిందితుడిని అరెస్టు చేసి.. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

మహిళ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణంగా ప్రవర్తించారని, బాధితురాలు వేడుకుంటున్నా కనికరం చూపించలేదని వెల్లడించారు.

ఇవీ చూడండి: Woman Suicide for Blouse : భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

సహజీవనానికి 'నో' చెప్పాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.