ETV Bharat / bharat

భర్త జననాంగాలు కోసి దారుణ హత్య.. కారణం ఇదే! - ఉత్తరాఖండ్​లో భర్త జననాంగాలు కోసిన భార్య

Woman kills husband: భర్త జననాంగాన్ని కోసి దారుణంగా హతమార్చింది ఓ మహిళ. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని పిథౌరాగఢ్​లో జరిగింది.

Woman kills husband cutting off his genitals
భర్త జననాంగాలు కోసిన భార్య
author img

By

Published : Feb 19, 2022, 5:22 PM IST

Updated : Feb 19, 2022, 7:54 PM IST

Woman kills husband: ఉత్తరాఖండ్​ పిథౌరాగఢ్​లోని దిగాస్​లో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త జననాంగాలు కోసి హత్య చేసింది. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ భర్తను చంపేటప్పుడు ఆమె కుమార్తె కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ చిన్నారి తాను చూసి సమాచారాన్ని తండ్రి వైపు బంధువులకు చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో భర్తను చంపినందుకుగానూ ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేసినట్లు వివరించారు.

తన భర్త జితేంద్ర రామ్​ మద్యానికి బానిసై తనను చిత్రహింసలు పెట్టేవాడని నిందితురాలు తెలిపింది. ఆ రోజు కూడా తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టాడని పేర్కొంది. ఇంక గతి లేని పరిస్థితుల్లో ఆవేశంతో అతడ్ని చంపేసినట్లు పోలీసులు విచారణలో ఒప్పుకుంది.

పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన రేజర్​, తాడును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుపుతున్నారు. మహిళను మేజిస్ట్రేట్ ముందు గురువారం హజరుపరిచిన పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఆమె కుమార్తె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

భార్య వేధింపులకు.. భర్త ఆత్మహత్య.!

భార్య, ఆమె తరఫు బంధువుల వేధింపులు తాళ లేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలో ఉండే ఓ చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని దుంగాపుర్​ జిల్లాలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని భరత్​ యాదవ్​గా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి చనిపోయే ముందు వీడియో తీసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భారత్‌పై మళ్లీ దావూద్‌ గురి.. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర..

Last Updated : Feb 19, 2022, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.