ETV Bharat / bharat

పెళ్లి చేసుకోవట్లేదని ప్రియుడి గొంతు కోసిన మహిళ.. సూట్​కేస్​లో తరలిస్తూ.. - గాజియాబాద్​ క్రైం న్యూస్​

పెళ్లికి ఒప్పుకోలేదని సహజీవనం చేస్తున్న ప్రియుడిని దారుణంగా చంపింది ఓ మహిళ. మృతదేహాన్ని సూట్​కేస్​లో పెట్టి.. పడేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులకు చిక్కింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగింది.

After refusing to marry in Ghaziabad, boyfriend's throat was cut and stuffed in a suitcase

author img

By

Published : Aug 8, 2022, 3:22 PM IST

Updated : Aug 8, 2022, 3:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్​కేస్​లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్​ ప్రాంతానికి చెందిన ఫిరోజ్​గా గుర్తించారు.

After refusing to marry in Ghaziabad, boyfriend's throat was cut and stuffed in a suitcase
భారీ సూట్​కేసులో ఫిరోజ్ మృతదేహం​

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రీతి శర్మ తన భర్త దీపక్​ను విడిచిపెట్టి, నాలుగేళ్లుగా ఫిరోజ్​ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఫిరోజ్​ను ఆమె పెళ్లిచేసుకోవాలని భావించగా.. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో.. పక్కా పథకం ప్రకారం రేజర్​తో యువకుడి గొంతు కోసి చంపింది. అనంతరం.. మృతదేహాన్ని పడేసేందుకు దిల్లీలోని సీలంపుర్​ ప్రాంతంలో పెద్ద సూట్​కేసు కొనుగోలు చేసి తీసుకెళ్లింది. అనుమానించిన పోలీసులు.. మహిళను అనుసరించారు. సూట్​కేసులో మృతదేహాన్ని చూసి విచారించగా అసలు విషయం తెలిసింది. ఫిరోజ్..​ దిల్లీలో హెయిర్​ డ్రెస్సర్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోరిక తీర్చలేదని.. లైంగిక వాంఛ తీర్చనందుకు యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టి.. ట్రక్కు నుంచి కిందకు పడేశాడు ఓ డ్రైవర్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్..​ మథురాలోని దిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. శనివారం ఈ ఘటన జరిగింది.

ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే యువతి కోసికాలన్​ వద్ద రోడ్డు పక్కన నిల్చొని ఉంది. అప్పుడే అటుగా వచ్చిన ట్రక్కు డ్రైవర్​ లిఫ్ట్​ ఇస్తానని ఆమెను వాహనం ఎక్కేలా చేశాడు. కొద్దిసేపటికి ఆమెపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు. ప్రతిఘటించిన యువతి సాయం చేయమంటూ గట్టిగా అరిచింది. గమనించిన వాహనదారులు.. ట్రక్కును అనుసరించిన తరుణంలో నిందితుడు ఆమె తలపై రాడ్డు​తో కొట్టి బయటకు విసిరేశాడు. బాధితురాల్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ట్రక్కు డ్రైవర్​ను అరెస్టు చేశారు.

మైనర్లపై ప్రిన్సిపల్​ వేధింపులు.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ స్కూల్​ ప్రిన్సిపల్.. పిల్లలపై దారుణానికి తెగించాడు. ఇద్దరు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. 5,7 తరగతులకు చెందిన ఇద్దరు బాలికలు తమ ఇంట్లో విషయం చెప్పగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ సుర్జాపుర్​లో జరిగింది.

ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం.. ఆశ్రమ పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు సూపరింటెండెంట్​. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రాపుర్​లో జరిగింది. 13 ఏళ్ల బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

ప్రియురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ప్రియురాలికి మత్తుమందు ఇచ్చి బలవంతంగా అత్యాచారం చేశాడు 32 ఏళ్ల వ్యక్తి. ఈ ఘటన రాజస్థాన్​ జోధ్​పుర్​లో జరిగింది. అనంతరం ఆమె చనిపోయింది. బాధితురాలి మృతికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. డ్రగ్​ ఓవర్​డోస్​ వల్లే చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు బాధితురాలికి దగ్గరి బంధువని, ఐదేళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది.

ఇవీ చూడండి: దళితుడిపై దారుణం.. ఏ మతమో చెప్పాలని స్తంభానికి కట్టేసి, బట్టలు విప్పి..

మహిళల ముందు అసభ్య ప్రవర్తన.. 'అవి' చూపించాడని రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..

Last Updated : Aug 8, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.