ETV Bharat / bharat

సెల్​ఫోన్​ ఇవ్వలేదని తండ్రిని చంపిన కూతురు

సెల్​ఫోన్​ను దాచిపెట్టి.. తిరిగి ఇవ్వనందుకు కన్నతండ్రిని చంపిదో కసాయి కూతురు. కర్రతో కొట్టి హత్య చేసింది. ఛత్తీస్​గఢ్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Woman kills father over refusal to give mobile phone; held
సెల్​ఫోన్​ ఇవ్వలేదని తండ్రిని చంపిన కూతురు
author img

By

Published : Jan 26, 2021, 11:37 PM IST

సెల్​ఫోన్​ ఇవ్వలేదని కన్న తండ్రిని హత్య చేసింది ఓ కూతురు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనవరి 24న ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పూర్​ జిల్లాలో జరిగింది. నిందితురాలిని, ఆమెకు సహకరించిన తల్లిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది...

కాంచన్​పూర్​ గ్రామానికి చెందిన మాంగ్లు రామ్​ధనుకర్​(58) కూతురు పేరు దివ్య సరస్వతి. ఆమెకు పెళ్లైంది. ఇటీవలే ఆమె భర్త తల్లిదండ్రుల దగ్గరకి పంపించాడు. పుట్టింటికి వచ్చిన సరస్వతి... తన సెల్​ఫోన్​ కనిపించడం లేదని తండ్రి మాంగ్లును అడిగింది. తనేమన్న తీస్తే ఇవ్వమంది. తను సెల్​ఫోన్​ తీయలేదని మాంగ్లు సమాధానమిచ్చాడు.

అనుమానమొచ్చి కాస్త గట్టిగా అడిగింది సరస్వతి. దాంతో అతను నిజం చెప్పాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకున్నందుకే ఫోన్​ దాచినట్లు తెలిపాడు. ఎంతకీ ఫోన్ ఇవ్వకపోవడం వల్ల కర్రతో కొట్టి, రాయితో బాది తండ్రిని హతమార్చిందని పోలీసులు తెలిపారు. శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిందని, అందుకు ఆమె తల్లి సహకరించిందని పేర్కొన్నారు.

పక్కింటివారు ఈ ఘటనను చూసి తమకు సమాచరమిచ్చారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రాణాలు తీసిన మూఢత్వం.. సంచలనం రేపిన జంటహత్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.