మహారాష్ట్ర ఛందివలీలో విషాదం జరిగింది. తులీపియా అపార్ట్మెంట్స్లో ఓ మహిళ తన పదేళ్ల కుమారుడితో కలిసి 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సకినాకా పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
రేష్మ, సారత్ ములుకుత్ల దంపతులు. వాళ్లు ఛందివలీలోని తులీపియా అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల సారత్ కొవిడ్ బారిన పడి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం ఒంటరైంది. పొరుగింట్లో ఉండే ఆయుబ్ ఖాన్, షానాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్లు ఆ కుటుంబాన్ని వేధించటం మొదలు పెట్టారు. వేధింపులు తాళలేక రేష్మ, ఆమె కుమారుడు గరుద్(10)తో కలిసి 12 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేష్మ సూసైడ్ నోట్ ఆధారంగా.. షాదాబ్ ఖాన్ను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: Rape: ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లి.. హత్యాచారం!