ETV Bharat / bharat

210 నిమిషాలు ఆగిపోయిన గుండె.. వైద్యుల అరుదైన సర్జరీ.. చివరకు..! - meerut woman heart functioned through machines

మేరఠ్​లో ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాలపాటు ఆగిపోయింది. అయినా ఆమెను వైద్యులు కాపాడారు. ఇదేలా సాధ్యం అని అంటారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే....

Woman-heart-stopped-for-210-minutes-during-surgery-in-meerut

author img

By

Published : Sep 14, 2022, 2:15 PM IST

సాధారణంగా ఓ మనిషి గుండె మూడు నిమిషాలు కొట్టుకోకపోతే ఇక ఆ వ్యక్తి మన మధ్య లేనట్లే అని నిర్ధరిస్తారు వైద్యులు. అలాంటిది ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాలపాటు ఆగిపోయింది. అయినా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మేరఠ్​లోని లాలా లజపత్​ రాయ్​ మెమోరియల్​ వైద్య కళాశాలలో జరిగింది. ఓ మహిళ గుండెకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె గుండె దాదాపు 210 నిమిషాలు కొట్టుకోలేదు. అయినా ఆ ఆపరేషన్​ విజయవంతం చేసి ఆమె ప్రాణాలను రక్షించారు వైద్యులు.

వివరాల్లోకి వెళ్తే...
ఉత్తరప్రదేశ్​లోని కంకరఖేడాకు చెందిన కవిత అనే మహిళ గత రెండేళ్లుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. పనులు చేస్తుంటే అలసటగా ఉందని, తరచూ ఛాతి నొప్పి వస్తోందని ఆస్పత్రికి వెళ్లింది. ఎన్నో ఆస్పత్రులకు తిరిగినా వెయిటింగ్​ లిస్ట్ కారణంగా ఆమెకు​ చికిత్స అందలేదు. ఈ మేరకు మేరఠ్​లోని లాలా లజపత్​ రాయ్​ మెమోరియల్​ వైద్య కళాశాలను సంప్రదించింది.

మేరఠ్ మెడికల్ కాలేజీలోని కార్డియో థొరాసిక్ విభాగ వైద్య నిపుణులను సంప్రదించగా ప్రాథమిక పరీక్షల్లో మిట్రాల్ వాల్వ్ దెబ్బతిన్నట్లు తేలింది. వెంటనే ఆపరేషన్​ చేయాలని సూచించారు. మెషీన్ సహాయంతో మెకానికల్ హార్ట్ వాల్వ్​ను విజయవంతంగా అమర్చారు. ఇలాంటి ఆపరేషన్​ మేరఠ్ మెడికల్ కాలేజీ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండి: నది దాటి ఊర్లోకి వచ్చిన ఏనుగు పిల్ల.. గ్రామస్థుల ఆటలు!.. అధికారులు వచ్చి..

'అరవింద్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ పార్టీ'.. ఆప్‌పై కాంగ్రెస్‌ విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.