ETV Bharat / bharat

ఇప్పటికే ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు.. పిల్లాడి కోసం ప్రయత్నిస్తే ఒకేసారి మరో ముగ్గురు జననం - ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన రాజస్థాన్ మహిళ

రాజస్థాన్​లో ఒకేసారి ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చింది ఓ మహిళ. కాగా అప్పటికే మహిళలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లాడి కోసం ప్రయత్నిస్తున్న ఆ దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలు జన్మించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

woman gave birth to three boys one delivery
ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చిన మహిళ
author img

By

Published : Dec 21, 2022, 4:29 PM IST

ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది. రాజస్థాన్​లో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు ఒకేసారి పుట్టడం వల్ల కాస్త అనారోగ్యంతో ఉన్నారు ఆ చిన్నారులు. దీంతో 25 రోజులు చికిత్స పొందిన అనంతరం తల్లీబిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్లారు. దుంగార్పూర్ జిల్లా చెందిన జయంతిలాల్, బడి దంపతులకు ఇలా ఒకేసారి ముగ్గురు మగ పిల్లలు జన్మించారు.

హీరకేడి పిండవాల్ ప్రాంతంలో నివాసం ఉండే వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లాడు కావాలనే ఆశతో.. ఆ మహిళ మరోసారి గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆ మహిళ నవంబర్​ 26న.. సగ్వారాలోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్​లో చేరింది. అనంతరం ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది.

"ముగ్గురు పిల్లలు ఒక్కొక్కరు కేవలం కిలో బరువుతోనే పుట్టారు. శ్వాస తీసుకునేందుకు చిన్నారులు ఇబ్బంది పడ్డారు. దీంతో కృత్రిమంగా ఆక్సిజన్​ను అందించాం. పాలు తాగేందుకూ పిల్లలకు వీలు కాలేదు. పైపుల అమర్చి పాలు అందించాం." అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీరి కోసం ప్రత్యేకంగా డాక్టర్లు, నర్సులతో కూడిన ఓ బృందాన్ని నియమించినట్లు వారు వెల్లడించారు. తల్లీబిడ్డలు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని, వారిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఒకేసారి ముగ్గురు మగ పిల్లలు పుట్టడం వల్ల.. కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పుట్టిన మగ పిల్లలతో సమానంగా, తమ ముగ్గురు ఆడపిల్లలను చూసుకుంటామని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.