Woman Gang Rape in Hyderabad : ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా ఆడవాళ్లపై కామాంధుల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళ అత్యాచారానికి, అవమానాలకు గురవుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా మానవ మృగాలు ఆడవాళ్లను పీక్కు తింటున్నారు.
హైదరాబాద్ తార్నాకలో మహిళపై సామూహిక అత్యాచారం(Gang Rape in Hyderabad) జరిగింది. ఈ నెల 7వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం : "నగరంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన బర్నే ఏసు(32) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 7వ తేదీన అర్ధరాత్రి తార్నాక నుంచి ప్రశాంత్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. అదే ప్రాంతంలో ఓ మహిళ బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తున్న ఏసు, మహిళ ఒంటరిగా ఉండటం గమనించి ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెతో మాట కలిపి లాలాపేటలో దింపుతానని నమ్మించి, తన వాహనంపై ఎక్కించుకున్నాడు. ఆమెను తప్పుదోవ పట్టించి ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అనంతరం ఆమెపై ఏసు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సీత మధుయాదవ్(31)ను పిలిపించి ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. శ్రీగిరి ప్రశాంత్ కుమార్(20), రోహిత్(19), తరుణ్ కుమార్(20)లను పిలిపించి ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి దిగారు. అనంతరం మధుయాదవ్ ఆమెను తార్నాకలో దింపి అక్కడి నుంచి పరారయ్యాడు" అని ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్‌దత్ ఆదివారం వివరాలను వెల్లడించారు.
అశ్లీల వీడియోల్లో ఉన్నట్లుగా చేయాలని.. గ్యాంగ్‌రేప్‌లో విస్తుపోయే వాస్తవాలు
నిందితులకు జ్యూడిషియల్ రిమాండ్ : ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాలాగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించారు. ఆదివారం రోజున వారిని అరెస్టు చేసి, జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆదివారం ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్‌దత్ నిర్వహించిన సమావేశంలో ఏసీపీ జైపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మధులత, డీఐ ప్రభాకర్, ఎస్ఐలు షాహీద్ పాషా, నాగరాజ్‌లు ఉన్నారు.