దిల్లీలోని డాబ్డీ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ యువతిని దారణంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వివస్త్రను చేసి నాలాలో పడవేశారు. యువతి మృతదేహాన్ని పోలీసులు.. సెక్టార్ 2 ప్రాంతంలోని సీఎన్జీ పంప్ వద్ద ఆదివారం గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
వివరాలు తెలియకుండా ఉండేందుకు..
యువతి వివరాలు తెలియకుండా ఉండేందుకు నిందితులు ఆమె ముఖాన్ని కాల్చేశారు. దీంతో పాటు ఆమె జననాంగాన్ని కూడా కాల్చేసినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి వివరాలు కనుగొనేందుకు ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి : వాయుసేన సింహగర్జన- హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు!