ETV Bharat / bharat

కుమారుడి చదువు కోసం అమ్మ ఆత్మహత్య.. పరిహారం వస్తే ఫీజు కట్టొచ్చని.. - కుమారుడి చదువు కోసం అమ్మ ఆత్మహత్య

కుమారుడి కాలేజీ ఫీజులు కట్టలేక బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది.

Woman commits suicide by jumping in front of bus

author img

By

Published : Jul 18, 2023, 3:39 PM IST

Updated : Jul 18, 2023, 4:59 PM IST

కుమారుడి చదువు కోసం అమ్మ ఆత్మహత్

కుమారుడి ఫీజు డబ్బుల కోసం బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ప్రభుత్వ పరిహారం వస్తే ఫీజు కట్టొచ్చని.. వేగంగా వస్తున్న ప్రైవేట్​ బస్సు కింద పడి మరణించింది. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడు సేలంలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జూన్ 28న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. సేలం జిల్లాకు చెందిన పాపాపతి అనే మహిళ.. స్థానిక కలెక్టర్ ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త మరణించగా. ప్రస్తుతం కుమారుడు, కూతురుతో కలిసి ఉంటోంది. అయితే, కుమారుడు అడిగిన కళాశాల ఫీజు రూ.45,000 చెల్లించేందుకు పాపాపతి వద్ద డబ్బులు లేవు. దీంతో తెలిసిన వారందరినీ అడిగినా ప్రయోజనం లేదు. అప్పు కోసం వెతికినా ఎక్కడా దొరకలేదు. దీంతో పాపాపతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఉద్యోగిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే.. ప్రభుత్వం పరిహారం ఇస్తుందని సన్నిహితులు ఆమెకు సలహా ఇచ్చారు. కారుణ్య నియామకాల ద్వారా కుమారుడికి ఉద్యోగం సైతం ప్రభుత్వ ఇస్తోందని ఆమెకు చెప్పారు.

వారి మాటలను నమ్మిన పాపాపతి.. అగ్రహారం వద్ద వేగంగా వస్తున్న బస్సుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అయితే, పాపాపతి.. ప్రభుత్వ ఉద్యోగి కాదని.. ఒప్పంద కార్మికురాలని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. ఆత్మహత్య కేసుగా మార్చారు. మహిళ ఉద్దేశపూర్వకంగానే బస్సు కింద పడినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోందని దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.

కొడుకు కోసం 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలోమీటర్లు ప్రయాణం
పిల్లల కోసం తల్లులు ఇలాంటి త్యాగాలు, సాహసాలు చేయడం కొత్తేం కాదు. గతంలో.. అనారోగ్యానికి గురైన కొడుకును చూసేందుకు సాహసమే చేసింది కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ మాతృమూర్తి. కరోనా కాలంలో ఏకంగా 6 రాష్ట్రాలు దాటి 2,700 కిలో మీటర్లు ప్రయాణించింది. తిరువనంతపురానికి చెందిన షీలమ్మ (50) అనే మహిళ కొడుకు బీఎస్​ఎఫ్​ జవాను. రాజస్థాన్​ జోధ్​పుర్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. అయితే.. అతడు మైయోసిటిస్​తో బాధపడుతున్నాడు. లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో కొడుకును కలుసుకునే వీలులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా తన బిడ్డను చూడాలని నిర్ణయించుకుంది. తన అల్లుడు, ఇంకో బంధువుతో కారులో మూడు రోజుల పాటు 6 రాష్ట్రాల మీదుగా 2,700 కిలోమీటర్లు ప్రయాణించి జోధ్​పుర్​కు చేరుకుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి : కొడుకు కోసం ఫుట్​బాల్​ ట్రైనర్​ అవతారమెత్తిన తల్లి!

70 ఏళ్ల వయసులో కొడుకు కోసం 140 కి.మీ.నడక

Last Updated : Jul 18, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.