రాజస్థాన్‌లోని గొగుండా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ (Pratap Bheel MLA) తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ ఉదయ్‌పుర్ జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఉద్యోగం ఆశచూపి తనపై (Pratap Bheel MLA) అఘాయిత్యానికి ఒడిగట్టారని.. తనను వివాహం చేసుకుంటానని కూడా హామీ ఇచ్చారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
10 నెలల్లోనే మరో కేసు
భాజపా ఎమ్మెల్యే ప్రతాప్ భీల్‌పై (Pratap Bheel MLA) 10 నెలల క్రితం కూడా సుఖేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అత్యాచారం కేసు నమోదైందని ఎస్పీ వెల్లడించారు. రెండు కేసులనూ సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
ఇదీ చూడండి : 'సంపద, ఉద్యోగాలు సృష్టించే వారికి బ్యాంకులు మద్దతివ్వాలి'