నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే యమా ఇష్టం. ఇక చికెన్ ఎగ్ రోల్ చూస్తే తినకుండా ఉండలేరు. చాలా చోట్ల ఇది దొరుకుతుంది. అయితే దిల్లీలోని మోడల్ టౌన్ ఏరియాలో దొరికే చికెన్ ఎగ్ రోల్ చాలా ఫేమస్! ఎందుకంటే ఇక్కడ దొరికే సైజులో ఎగ్ రోల్‌ను మీరు ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరు! రెండు అడుగులు ఉండే ఈ స్పైసీ రోల్‌ను అక్కడి ఆహార ప్రియులు తెగ లాగించేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, అదికాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ చికెగ్ ఎగ్ రోల్లో పది గుడ్లు సహ ఎక్కువ మొత్తంలో కోడి మాంసాన్ని కలిపి తయారుచేస్తారు మోడల్ టౌన్ ఏరియాలోని పాట్నా రోల్ సెంటర్ హోటల్ నిర్వాహకులు. దీని ధర రూ.600. ఈ ఐటెమ్ శాకాహారంలోనూ దొరుకుతుంది. దీని ధర రూ. 400. మీరు ఈ రోల్‌ను తినాలని అనుకుంటే మీకు కావాల్సిన పరిణామంలో ఇంట్లోనే వండటానికి ప్రయత్నించండి!
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: రుచికరమైన చికెన్ ఫ్రాంకీ చేసుకోండిలా..